YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మోడీ ఎగ్జిట్ పై ఆసక్తిగా జనం

మోడీ ఎగ్జిట్ పై ఆసక్తిగా జనం

మోడీ ఎగ్జిట్ పై ఆసక్తిగా జనం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28
లాక్ డౌన్ ను ఎలా తొలగిస్తారన్న దానిపై భారత్ వైపు ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తుంది. ప్రస్తుతం భారత్ లో దాదాపు నాలుగు వందల జిల్లాలకు పైగా కరోనా వైరస్ సోకలేదు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించారు. వీటిలో దాదాపు ఇరవై ఐదు వేల మంది కరోనా వైరస్ బారిన పడినట్లు నిర్థారణ అయింది. మే 3వ తేదీ వరకూ లాక్ డౌన్ ను దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ విధించారు.సోమవారం నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రుల అభిప్రాయాలను సేకరించారు. లాక్ డౌన్ ను ప్రకటించే నాటికి, ఇప్పటికి 16 శాతం కేసులు పెరగడం ఆందోళన కల్గించే అంశమే. అయితే ఇతర దేశాల్లో లాక్ డౌన్ ను ఎత్తివేసి కేసులు పెరగడంతో మళ్లీ లాక్ డౌన్ ను విధించారు. దీనికి సింగపూర్ ను ఉదాహరణగా చూపుతున్నారు.ఇప్పటికే భారత్ లో లాక్ డౌన్ లో కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఏప్రిల్ 20వ తేదీ తర్వాత నుంచి కొన్ని రంగాకు లాక్ డౌన్ లో మినహాయింపులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత మళ్లీ పుస్తకాల షాపులు, మొబైల్ ఛార్జిల షాపులు, ఎలక్ట్రిక్ ఫ్యాన్ల విక్రయాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. క్రమంగా లాక్ డౌన్ లో మినహాయింపులు ఇస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తుంది. అయితే కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో మే 3వ తేదీ తర్వాత లాక్ డౌన్ ను మళ్లీ పొడిగిస్తారన్న ప్రచారం జరుగుతుంది.ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత మోదీ ఈ నిర్ణయం తీసుకోనున్నారు. మే 3వ తేదీపై మోదీ లాక్ డౌన్ కొనసాగింపుపై ప్రకటన చేసే అవకాశముంది. ఇప్పటికే రాష్ట్రాలు ఆదాయాలు కోల్పోయి ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు పేద, మధ్యతరగతి ప్రజల్లోనూ లాక్ డౌన్ పై అసంతృప్తి పెరుగుతోంది. లాక్‌డౌన్ మాట అటుంచి మోడీ ప్రభుత్వం ఎకానమీని తిరిగి నిలబెట్టుకునే ప్రక్రియలో భాగంగా ప్రణాళికలు చెప్పారు. విదేశాల్లో ఉన్న భారతీయులు, వలస కార్మికులు కొవిడ్ 19ను ఎదుర్కొంటున్న తీరును వివరించారు. భారత్ మొత్తం కరోనావైరస్‌ను అడ్డుకునే క్రమంలో మార్చి 25నుంచి పూర్తి స్థాయి లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. లాక్ డౌన్ ఆర్థిక వ్యవస్థను కుదేలయ్యేలా చేసింది. చాలా దేశాలు భారత్ కంటే చిన్నవే. మహమ్మారి ధాటికి అవి కూడా నష్టపోయాయి. వైరస్ ప్రమాదాన్ని భారత్ నుంచి దూరం చేశాం. రాష్ట్రాలన్నీ ఆర్థికంగా పుంజుకోవడానికి కష్టపడాలని.. అదే సమయంలో వైరస్ వ్యాప్తి కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా పీఎం మోడీ మెసేజ్ గురించి చెప్తూ లాక్ డౌన్ రిలాక్సింగ్ ఇచ్చినప్పటికీ మైండ్ సెట్ లో మాత్రం మార్పులు రాకూడదని చెప్పారు. త్వరగా ప్రభుత్వాలు పుంజుకోవాలని.. మనమంతా ధైర్యంగా ఉండి సామాన్య పౌరుల ప్రాణాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పీఎం మనసులో ఉన్న ఆలోచనలు మాత్రం లాక్‌డౌన్ పూర్తయినా మారవని చెప్పారు. వలస కార్మికులపై ముఖ్యమంత్రులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వారిని జాగ్రత్తగా చూసుకోకపోతే సొంతూళ్లకు వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తారని.. అలా వైరస్ ఒకచోట నుంచి మరొక చోటికి వ్యాప్తి చెందుతుందని సూచించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాకరే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి వలస కార్మికులను సొంతూళ్లకు పంపాలని అడుగుతూనే ఉన్నారు. ఇతర ముఖ్యమంత్రులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని పంపించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆమోదాన్ని తిరస్కరించకుండానే పీఎం మోడీ మెసేజ్ ఇచ్చారు. రాష్ట్రాలు ఫ్యాక్టరీలను, పరిశ్రమలను వలస కార్మికులు లేకుండా ఎలా పని చేయించాలో వివరించారు. విదేశాల్లో ఇరుక్కున్న భారతీయులను తీసుకొచ్చి ఇక్కడ క్వారంటైన్లో ఉంచుతామని మోడీ చెప్పారు. వారందరినీ క్వారంటైన్ సెంటర్లలో ఉంచి చూసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశించారు.వలస కార్మికులు తమ కుటుంబాల గురించి భయపడవద్దని.. వారి కోసం రిస్క్ చేసి ప్రయాణాలు చేయవద్దని సూచించారు. కొవిడ్ 19తో పోరాడేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసిన తీరును ప్రశసించారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి వైరస్ వ్యాప్తిని అడ్డుకున్నాయని చెప్పారు. ఒక రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయినా దేశం మొత్తం నష్టపోయినట్లే. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ రాష్ట్రంలోకి కేంద్రం నుంచి వచ్చిన టీంను అడ్డుకున్న సందర్భంగా ఈ విధమైన కామెంట్లు చేశారు. మరి ఈ సమయంలో మోదీ లాక్ డౌన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది. మరికొన్ని రంగాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తారా? లేక మరికొన్నాళ్లు లాక్ డౌన్ ను పొడిగిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. మే చివరినాటికి మరణాల సంఖ్య దాదాపు 38 వేలకు చేరుకుంటుందన్న అంచనాల మధ్య మోదీ డిసిషన్ ఎలా ఉంటుందన్నది ఉత్కంఠగా మారింది.

Related Posts