YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సమీక్షలతో చంద్రబాబును మించిపోతున్న జగన్

సమీక్షలతో చంద్రబాబును మించిపోతున్న జగన్

సమీక్షలతో చంద్రబాబును మించిపోతున్న జగన్
విజయవాడ, ఏప్రిల్ 28
త పదేళ్ళూ జగన్ జనంలో ఉంటూ తిరిగి గెలిచాడు. ఇక ఏడాదిగా ముఖ్యమంత్రిగా ఉంటూ బయట తిరగక నష్టపోతున్నారా? అంటే కొంతవరకూ అదీ నిజమేననిపిస్తోంది. జగన్ తాను పూర్తిగా సమీక్షలకే పరిమితం అవుతున్నారు. ఇలా సమీక్షల్లోనే జగన్ రికార్డు సృష్టించేలా ఉన్నారు. గతంలో చంద్రబాబు కూడా మంత్రులు, అధికారులతో వరసపెట్టి సమీక్షలు నిర్వహించేవారు. వీడియో కాన్ఫరెన్సులు కూడా పెట్టేవారు. అదే సమయంలో ఏపీ అంతా విస్తృతంగా పర్యటించేవారు. చంద్రబాబుకు దాని వల్ల గ్రౌండ్ రియాల్టీ తెలిసేది. అధికారులు సైతం భయపడేవారు.వాస్తవాలు చెప్పేవారు. ఇపుడు జగన్ తీరు దీనికి భిన్నంగా ఉందని అంటున్నారు.జగన్ సమీక్షలు, వాటి ఫలితాలు పై స్థాయిలోనే ఉండిపోతున్నాయన్న సంగతి చాలా కాలంగా ఉన్న మాట. జగన్ ముందు అధికారులు ఊ కొడుతున్నారు కానీ చాలా వరకూ అక్కడ అన్నట్లుగా అట్టడుగు స్థాయిలో పని కావడంలేదు. అందుకే భారీ తేడా వచ్చేస్తోంది. ఇక జగన్ పూర్తిగా అధికారులనే నమ్ముకుంటున్నారు. అలాగే మంత్రుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. అయితే జగన్ ఎపుడైతే బయటకు రావడంలేదో సమీక్షలో ఎవరేమీ చెప్పినా కూడా వాటినే ఆయన కూడా నమ్మాల్సివస్తోంది. దాంతో పాలనపైన పెను ప్రభావం చూపిస్తోంది.నిజానికి కరోనా వైరస్ గతంలో ఎన్నడూ లేనిది, ఎవరూ ఇంతటి విపత్తు చూడనిది. జగన్ ఈ విషయంలో చేయాల్సిందంతా చేస్తున్నారు. అదే సమయంలో మీడియా ముఖంగానో, మరో విధంగానో జనాలకు కనిపించాల్సిఉంది. అలాగే జనాల నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ తెప్పించుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సింది. ఇక జగన్ సైతం ఒకటి రెండు చోట్ల పర్యటిస్తే జనాలకు భరోసా వస్తుందన్న మాట కూడా ఉంది. అయితే జగన్ మీడియాకే పెద్దగా ముఖం చూపించడంలేదు. దాంతో విపక్షాలు ఆయన్ని రాజప్రాసాదంలో ఉండే మహారాజుగా చిత్రీకరిస్తున్నాయి.జగన్ కి జనం గోడు పట్టడంలేదని కూడా అంటున్నాయి.జగన్ కి వాస్తవాలు అధికారులు చెప్పడంలేదని, ఇంటలిజెన్స్ విభాగం కూడా ఫెయిల్ అయిందని టీడీపీ నేత వర్ల రామయ్య అంటున్నారు. జగన్ ఒక్కసారి కళ్ళు తెరచి వాస్తవాలు చూడాలని కూడా ఆయన కోరుతున్నారు. ప్రతిపక్షం అని వర్ల మాటలను కొట్టివేయడానికి లేదు కానీ, ఇంటలిజెన్స్ వర్గాలు కానీ, ఇతర అధికారులు కానీ ముఖ్యమంత్రి సమీక్షలో ఏం చెబుతున్నారన్నది కూడా చర్చగా ఉంది. ఏపీలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోయాయి. వేయి దాటేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఇంకా సీరియస్ గా ఉండాల్సిన అవసరం మాత్రం ఉందని అంతా అంటున్నారు. జగన్ నేరుగా ప్రజలతోనే కాంటాక్ట్ లోకి రావాలని, మీడియాను అనుసంధానం చేసుకున్నా కూడా అది అంతిమంగా ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని సూచనలు అందుతున్నాయి. లేకపోతే నాలుగు గోడల మధ్య జగన్ ఎన్ని రకాల సమీక్షలు చేసినా జనాలకు ప్రభుత్వం సీరియస్ నెస్ కూడా తెలియడం లేదని అంటున్నారు. దానికి తోడు అగ్గిరాజేయడానికి విపక్షాలు ఎటూ ఉన్నాయి.

Related Posts