YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అసత్య ఆరోపణలు మానుకోవాలి

అసత్య ఆరోపణలు మానుకోవాలి

అసత్య ఆరోపణలు మానుకోవాలి
తాడేపల్లి ఏప్రిల్  28
కరోనా పై ప్రజలను సీఎం అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలకు అండగా సీఎం జగన్మోహన్ రెడ్డి నిలుస్తున్నారు. ఇంట్లో కూర్చొని చంద్రబాబు దిక్కుమాలిన లేఖలు రాస్తున్నారు. ఎవరో తన తాబేదారుడు రాసిన లేఖపై చంద్రబాబు సంతకం చేసినట్లు ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ జీ శ్రీకాంత్ రెడ్డి ఆరో్పించారు.  చంద్రబాబు లేఖలో పేర్కొన్నవి అన్ని అబద్ధాలే. చంద్రబాబు లేఖలో ఉపయోగ పడే అంశాలు ఏమి లేవు. చంద్రబాబు ఆయన కుమారుడు హైదరాబాద్ లో కూర్చొని ప్రభుత్వం పై బురద జల్లుతున్నారు. చంద్రబాబు రైతుల గురించి మాట్లాడడితే ప్రజలు నవ్వుతారు. చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు ప్రజలను లాక్ డౌన్ పాటించమని చెపుతున్నాడు. కానీ ఆయన కుమారుడు రోడ్లు మీద షికార్లు చేస్తున్నాడు. కనీసం మొహానికి మాస్క్ కూడా లోకేష్ ధరించలేదు. చంద్రబాబు మౌత్ పీస్ కన్నా లక్ష్మీనారాయణ. సవాలు మీద పేలాలు ఎరుకొనే రకం టీడీపీ నేతలని మండిపడ్డారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్లును ప్రభుత్వం పారదర్శకంగా కొనుగోలు చేసింది. చంద్రబాబు నాయకత్వం బిల్డప్ లకే పరిమితం. నాయకత్వం అంటే బిల్డప్ లు ఇవ్వడం కాదు. పాత ఫొటోలతో ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారని అన్నారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న ఫీజ్ రియంబర్స్ మెంట్ కు 4 వేల కోట్లు కేటాయించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల ఉబిలోకి నెట్టారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేక పోయిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కరోనా నివారణలో దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ నిలిసింది. వైస్సార్సీపీ నాయకులు అనేక సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. వైస్సార్సీపీ నేతలు వలనే కరోనా వచ్చిందని మాట్లాడడం చంద్రబాబు నీచ రాజకీయానికి నిదర్శనమని అన్నారు. దళితుడైన కనగ రాజ్ ను ఎన్నికల కమిషనర్ గా నియనిస్తే చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారు. కనగరాజ్ వలన గవర్నర్ కార్యాలయంలో కరోనా వచ్చిందని అసత్య ప్రచారం చేస్తున్నారు. ప్రధానమంత్రి వలన దేశంలో కరోనా వచ్చిందని విమర్శలు చేయగలవా చంద్రబాబు అని ప్రశ్నించారు. కరోనా వస్తే చనిపోతారని చంద్రబాబు ప్రజలను భయపెడుతున్నారు. కరోనా వస్తే చనిపోరని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ధైర్యం చెపుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. దానికి భిన్నంగా రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీకి మౌత్ పీస్ గా  మిగతా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మారిపోయాయి.. చంద్రబాబు పక్క రాష్టంలో దాగోని విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రజలపై అభిమానం ఉంటే రాష్ట్రానికి రావాలని అన్నారు.

 

Related Posts