శివ లీల కాకపోతే ఏంటీ..
శైవ క్షేత్రాల్లో కరోనా కేసులే లేవు.. ఏంటీ మహిమ
కరోనా వైరస్ వచ్చి ప్రపంచం మొత్తం విలవిలలాడుతుంది. తెలుగు రాష్ట్రాలు కూడా అందుకు మినహాయింపు కాదు. దేశం మొత్తం కేసులు నమోదు అవుతున్నాయి. విచిత్రం ఏంటంటే.. ఆది శంకరుడు కొలువైన శైవ క్షేత్రాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవటం విచిత్రంగా చెప్పుకుంటున్నారు జనం. ఇదేదో ఊరికే చెప్పటం లేదు.. ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలే అందుకు సాక్ష్యం.
> శ్రీశైలంలో కరోనా కేసులు నమోదు కాలేదు.
> శ్రీకాళహస్తిలో మూడు కరోనా కేసులు అని ప్రకటించినా.. అందులో ఒకరికి తర్వాత నెగెటివ్ వచ్చింది. మిగతా ఇద్దరిని కూడా అనుమానాస్పదంగా క్వారంటైన్ చేశారు. ఆ తర్వాత వారు నెగెటివ్ రావటంతో సురక్షితంగా ఇంటికి చేరారు.
> కర్నూలు జిల్లా యాగంటి, మహానందిలో కరోనా వైరస్ లేదు
> గుంటూరు జిల్లా కోటప్పకొండలోనూ కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదు
> శ్రీకాకుళం జిల్లా శ్రీముఖ లింగం శివాలయం గ్రామంలోనూ కరోనా లేదు
> పంచారామ క్షేత్రాలు అయిన ద్రాక్షారామం, సామర్లకోట, భీమవరం, పాలకొల్లు, అమరావతిలో స్థానికులకు కరోనా లక్షణాలే కనిపించలేదు. సామర్లకోట, పాలకొల్లులో కరోనా పాజిటివ్ కేసులు వచ్చినా.. వారు ఢిల్లీకి వెళ్లి వచ్చిన ముస్లింలు కావటం విశేషం.
వారణాసి పట్టణంలో కరోనానే లేదు :
ఉత్తరప్రదేశ్ లో రోజురోజుకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే శివుడు కొలువైన కాశీ పుణ్యక్షేత్రంలో మాత్రం ఒక్క కరోనా కేసు కాదు కదా.. కనీసం అనుమానిత కేసులు కూడా లేకపోవటం విచిత్రంగా చెప్పుకుంటున్నారు. వేలాది మంది ఇతర రాష్ట్రాలు, దేశాల వారు కాశీలో చిక్కుకుపోయారు. అయినా కూడా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు అంటే అంతా శివుడు మహిమ అంటున్నారు.
కాశీలోనే కాదు.. జ్యోతిర్లింగాలుగా పిలువబడే క్షేత్రాల్లోని ప్రజలు కూడా కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉన్నారు.
> రామేశ్వరంలో కరోనా కేసులు నమోదు కాలేదు
> మహారాష్ట్రలోని పూణెకు సమీపంలో ఉన్న భీమశంకరం పట్టణంలోనూ కరోనానే లేదు
> మహారాష్ట్ర ఔరంగాబాద్ సమీపంలోని ఘృష్ణేశ్వరం కొలువైన పట్టణంలోనూ కరోనా ఛాయలే లేవు.
> మహారాష్ట్రలోనే నాసిక్ లోనూ కరోనా కేసులు నమోదు కాలేదు. అయితే ఓ వ్యక్తి కరోనా అనుమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతనికి కరోనా లేదని డాక్టర్లు తర్వాత ప్రకటించారు.
> గుజరాత్ లోని గిర్ సోమనాథ్ జిల్లాలో కొలువైన సోమనాథ పట్టణంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి లేదు.
> మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓంకారేశ్వరుడు కొలువైన జిల్లాలో కరోనా ఉన్నా.. స్వామి ఉన్న ప్రాంతంలో మాత్రం కరోనా కేసులు, అనుమానితులు లేకపోవటం విశేషం.
> మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లాలో కేసులు తక్కువగా ఉన్నా.. మహాకాళిగా శివుడు కొలువైన పట్టణంలో మాత్రం కరోనా లేకపోవటం ఆయన మహిమగా చెప్పుకొంటున్నారు.
> ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగలో కొలువైన కేరాదేశ్వర మహా శివుడు ఉన్న ప్రాంతంలోనూ అసలు కరోనా అనుమానితులే కనిపించకపోవటం స్వామి మహిమగా చెప్పుకుంటున్నారు శివభక్తులు.
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని భయాందోళనలు చెందుతున్న ప్రజలు.. శివక్షేత్రాల్లో వైరస్ లేకపోవటాన్ని మాత్రం శివయ్య లీలలుగా చెప్పుకుంటున్నారు. అంతెందుకు కాశీ పుణ్యక్షేత్రంలో చిక్కుకుపోయి.. 25 రోజుల తర్వాత ఏపీకి వచ్చిన 250 మంది భక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులే ఆశ్చర్యపోయారు. ఎవరికీ కూడా కరోనా పాజిటివ్ రాలేదు. 2 - 3 సార్లు పరీక్షలు నిర్వహించిన తర్వాత విడుదల చేస్తాం అని ప్రకటించారు వైద్యులు.
అంతా *శివయ్య లీలలు* కదా..