YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

డ్రైనేజ్ లో కోటిన్నర బీరు

డ్రైనేజ్ లో కోటిన్నర బీరు

డ్రైనేజ్ లో కోటిన్నర బీరు
హైద్రాబాద్, ఏప్రిల్ 28
లాక్‌ డౌన్‌ వల్ల అన్ని దుకాణాలు మూత పడడంతో వివిధ రంగాలకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. ఇక మద్యం ఫ్యాక్టరీల వారికి వస్తోన్న లోటు అంతా ఇంతా కాదు. ఉన్నట్టుండి లాక్ డౌన్ విధించడంతో అన్ని కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అమ్మకాలు పూర్తిగా నిలిచిపోవడంతో రాష్ట్రంలో ఏకంగా సుమారుగా కోటిన్నర లీటర్ల బీరు వృథాగా పోనుంది. సాధారణంగా బీరు తయారైనప్పటి నుంచి సుమారు 6 నెలల గడువు వరకూ వాడుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీర్లు తయారుచేసే ఫ్యాక్టరీలు, ఎక్సైజ్‌ డిపోలు, మద్యం దుకాణాల్లో సుమారు 20 లక్షల పెట్టెల బీరు నిల్వ ఉన్నట్టుగా అధికారుల అంచనా.ఈ పరిమాణం లీటర్ల లెక్కన చూస్తే సుమారు కోటిన్నర లీటర్లవరకూ ఉంటుందని అబ్కారీశాఖ అంచనా వేస్తోంది. బీరు తయారీ తర్వాత దాని వాడుక గడువు తీరిపో వడంతో అది వినియోగానికి పనికిరాకుండా అవుతుందని తెలుస్తోంది. సాధారణ లెక్కల ప్రకారం ఏటా ఏప్రిల్‌లో సరాసరిన రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల పెట్టెల మేర బీరు అమ్ముడుపోయేదని.. దీని విలువ సుమారు రూ.600 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇక, బీర్ల వినియోగంలో హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉంది. ఏప్రిల్‌లో రాష్ట్రంలో 50 లక్షల కేసుల బీరు వినియోగం ఉండగా, ఇందులో 50 శాతం నగరంలోనే విక్రయమయ్యేవి.మే నెలలోనూ దాదాపు ఇదే స్థాయిలో అమ్మకాలు ఉంటాయి. ఇప్పటికే లాక్ డౌన్ మే 7 వరకూ పొడిగించడంతో, ఇంకా పొడిగించే అవకాశాలు ఉండడంతో రెండు నెలలకు కలిపి సుమారు రూ.1,200 కోట్లు విలువైన బీర్ల అమ్మకాలు జరగడం లేదని అధికారులు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం చూసి, కొన్ని బీర్ల తయారీ సంస్థలు ముందస్తు జాగ్రత్తగా మార్చిలోనే ఉత్పత్తి నిలిపివేశాయి. అప్పటికే తయారుచేసిన స్టాక్ పలు చోట్ల గోదాముల్లో నిల్వ ఉంది. ఇలా ఉన్న బీరును తప్పనిసరిగా డ్రైనేజీ పాలు చేయాల్సిందేనని అధికారులు అంటున్నారు.

Related Posts