వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్
న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై 13వ సార్లు అవిశ్వాస నోటీసు ఇచ్చామని, వంద మందికి పైగా ఎంపీలు తమ పోరాటానికి మద్దతు తెలిపారని వైకాపా ఎంపీ వరప్రసాద్ రావు తెలిపారు. ఇప్పటికే స్పీకర్ సుమిత్రా మహాజన్కు కలిసి, చర్చకు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో కలిసేందుకే చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారన్నారు. ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్సీపీ నాలుగేళ్లుగా పోరాడుతోందని, ఇదే విషయం చంద్రబాబుకు కూడా తెలుసునన్నారు. ఈ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే బాబు రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నారన్నారు. హోదా విషయంలో ప్రజలు తమని ఆదరిస్తున్నారనే.. చంద్రబాబు మాపై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. 600 హామీల్లో ఒక్కటీ నెరవేర్చని చంద్రబాబా తమకు నీతులు చేప్పేది.. ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకుని ఎంపీలతో రాజీనామాలు చేయించి.. తమతో పాటు ఆమరణ దీక్షలో పాల్గొనాలన్నారు. ఎంపీ మిథున్రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ డ్రామాలు కట్టిపెట్టాలని అన్నారు. కలిసికట్టుగా పోరాడాలి.. ప్రత్యేక హోదా సాధించాలన్నారు. బీజేపీ దిగి రావాల్సిందే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు.
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి : వైకాపా ఎంపీలు