YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కన్ఫ్యూజన్ లో కేంద్రం

కన్ఫ్యూజన్ లో కేంద్రం

కన్ఫ్యూజన్ లో కేంద్రం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28
శంలో ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ కట్టడికి ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ‘లాక్‌డౌన్‌’ నిర్ణయం బ్రహ్మాండంగా పనిచేసిందని, ఫలితంగా కరోనా కొత్త కేసుల సంఖ్య మందగింజిందని నీతి ఆయోగ్‌ సభ్యుడు, మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ అధ్యక్షుడు వీకే పాల్‌ శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మోదీ ప్రకటించిన లాక్‌డౌన్‌ ముగిసే మూడో తేదీ నాటి నుంచి కొత్త కేసుల సంఖ్య మరింత తగ్గుతుందని, మే 16వ తేదీ నుంచి ఒక్క కొత్త కేసు కూడా నమోదయ్యే ఆస్కారం లేదని వీకే పాల్‌ చెప్పారు.మే మూడవ తేదీ నుంచి కొత్త కేసులు తగ్గుతాయని చెప్పడం సహేతుకం కాదని అదే కమిటీలో ఉన్న స్వతంత్య్ర సభ్యడొకరు చెప్పారు. ఈ విషయాన్ని ‘హిందూ’ పత్రిక కవర్‌ చేసింది. ముంబైలో మే 15వ తేదీ నాటికి కేసులు చాలా ఎక్కువగా పెరగుతాయని, రోజు రోజుకు కేసుల సంఖ్య 20 శాతం పెరగవచ్చని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 22వ తేదీన వెల్లడించిన సమాచారానికి ఇది పూర్తి విరుద్ధం. పైగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో కరోనా కేసులపై అంచనాలు మరీ తీవ్రంగా ఉన్నాయి. ఆగస్టు 15వ తేదీ నాటికి దేశంలో కరోనా కేసులు 2.74 కోట్లకు చేరుకుంటాయని తెలిపింది. కరోనా కేసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అంచనాలు ఇంత గందరగోళంగా, పరస్పర విరుద్ధంగా ఉండడం ఏమిటీ? ఏ ప్రాతిపదికనా కేంద్రం ఈ అంచనాలకు వచ్చింది? ఎవరికి అసలు విషయం పడుతున్నట్లు లేదు. ఎవరికి తోచింది వారు చెప్పుకు పోతున్నారు. మే మూడవ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను పొడిగించాలా, లేదా అన్న విషయంలోకూ ఏకాభిప్రాయం లేదు. కొందరు పొడిగించాలని సూచిస్తున్నారు. మరి కొందరు అవసరం లేదంటున్నారు. ప్రజల్లో మాత్రం కడుపునిండిన వారు కరోనా బారిన పడి ఎక్కడ చస్తామో అన్న భయంతోని లాక్‌డౌన్‌ పొడిగించాలని కోరుకుంటున్నారు. ఆకలితో చస్తున్న వారు లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని కోరుకుంటున్నారు.
 

Related Posts