ఒలింపిక్స్ పై మీనమేషాలు
టోక్యో, ఏప్రిల్ 28
ప‌్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడు కనిపెట్టకముందే టోక్యో ఒలింపిక్స్ నిర్వహించడం కాస్త ఇబ్బందికర విషయమే అని జపాన్ మెడికల్ అసోసియేషన్ (జేఎమ్ఏ) పేర్కొంది. విశ్వ క్రీడల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించడం లేదని జేఎమ్ఏ చీఫ్ యోషిటకే యొకొకోరా పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జరగాల్సి ఉన్న టోక్యో ఒలింపిక్స్.. కొవిడ్-19 కారణంగా ఏడాది పాటు వాయిదా పడ్డ విషయం తెలిసిందే.`జపాన్.. ఒలింపిక్స్ నిర్వహిచడం గురించో.. రద్దు చేయడం గురించో నేను మాట్లాడటం లేదు. ప్రమాదకర వైరస్‌పై పూర్తి ప్రభావం చూపగల వ్యాక్సిన్ రావడానికి ముందు విశ్వక్రీడలు కష్టమే` అని యోషిటకే అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతున్నా.. జపాన్ ప్రభుత్వం మహమ్మారిపై దీటుగా పోరాడుతున్నదని ఆయన చెప్పారు.