మే 3 తర్వాత స్వదేశాలకు..!
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 28
కరోనా ప్రభావంతో అంతర్జాతీయ విమాన సేవలు నిలిపివేయడంతో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. మే 3 తర్వాత లాక్‌డౌన్‌కు కొన్ని సడలిం పులు ఇవ్వాలని యోచిస్తున్న కేంద్రం.. ప్రవాసీల ను తీసుకురావడానికి ప్రత్యేకంగా విమానాలు పంపాల ని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా విశ్వరూపం చూపుతుండటంతో గత నెల 22న అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వం అదే నెల 24 నుంచి లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. దీం తో విద్య, ఉద్యోగ, ఉపాధి, పర్యాటకానికి వివిధ దేశాలకు వెళ్లిన భారతీ యులు అక్కడే చిక్కుకుపోయారు. ఆయా దేశాల్లోనూ లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నే విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తీసుకురావాలనే డి మాండ్ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయినవారి సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం సేకరిస్తోంది. ఆయా దేశాల నుంచి ఎం తమంది భారత్‌కు రానున్నారనే వివరాలను సేకరించాలని భారత రా యబార కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం ఆన్‌లైన్‌లో వివరాలను సేకరించగా.. తాజాగా సోమవారం ఖతర్‌లోని రాయబార కార్యాలయం కూడా ట్రావె ల్ అడ్వైజరీని జారీ చేసింది.