యుద్ద ప్రాతిపదికన గోదాముల నిర్మాణం : సిఎం ఆదేశం
హైదరాబాద్ ఏప్రిల్ 28
రాష్ట్రంలో వ్యవసాయ పంట ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సర్కారు నిర్ణయించింది. ప్రాజెక్టులు పూర్తవుతుండటం, సాగు విస్తీర్ణం పెరగడంతో ప్రభుత్వం గోదాముల నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ 40 లక్షల మెట్రిక్ సామర్థ్యం కలిగిన గోదాములను అన్ని జిల్లాల్లో నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేసింది. త్వరలో డీపీఆర్‌ను ముఖ్యమంత్రికి అందజేసే అవకాశం ఉంది. దానిపై తుది నిర్ణయం తీసుకున్నాక నిర్మాణానికి అవసరమైన రుణం తీసుకుంటారు. ఈ గోదాముల నిర్మాణానికి సుమారు రూ.2,500 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు.