YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం తెలంగాణ

రైతులను ఇబ్బంది పెడుతున్న మిల్లర్లు

రైతులను ఇబ్బంది పెడుతున్న మిల్లర్లు

రైతులను ఇబ్బంది పెడుతున్న మిల్లర్లు
బీజెపి జిల్లా అధ్యక్షులు బాజోజి.భాస్కర్
జగిత్యాల ఏప్రిల్ 28
తప్ప, తాలు పేరుతో రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు బాజోజి భాస్కర్ ఆన్నారు.
మంగళవారం కోరుట్ల మండలం గుంలాపూర్ గ్రామంలో పీఏసీసీఎస్ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులనుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న కేంద్రాన్ని స్థానిక బీజెపి నేతలతో కలిసి సందర్శించారు. అష్టకష్టాలు పడి వరిధాన్యం పండించుకుంటే రైస్ మిల్లర్లు యజమానులు రైతులను తరుగు పేరిట దోచుకుంటున్నారన్నారు. రైతులనుంచి తాలుపేర, తేమ పేర తరుగు ఎంత తీస్తున్నారని, హమాలీ ఛార్జి ఎంత కట్ చేస్తున్నారని తెలుసుకొన గా క్వింటాలుకు ఖాంట వద్ద సంచి బరువుకి ఒక కిలో ఎక్కువ తూకం వేస్తూ రైస్ మిల్లర్లు 2 కిలో నుండి 3కిలోల తరుగు తీస్తున్నారని రైతులు వివరించారు. హమాలీ ఛార్జి గతంలో రూపాయలు 25 తీసుకొంటే ఇప్పుడు రూపాయలు 35 తీస్తున్నారని రైతులు తెలిపారు. రైస్ మిల్లర్లు తాలుపెర, తేమ పేర తరుగు తీయవద్దుని రైతులకు న్యాయం చేయాలని అధ్యక్షుడు డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రం వద్ద వసతులు కల్పించాలని అధికారులు కోరారు. జిల్లా అధ్యక్షుడు వెంట అసెంబ్లీ కన్వీనర్ గజెల్లి రాజేంద్రప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి పీసరి. నర్సయ్య, మండల అధ్యక్షుడు పంచిరి విజయ్, మైనారిటీ అధ్యక్షుడు రసూల్, సంకు నరేందర్, తిరుపతి, విజయ్, చిపిరిశెట్టి మల్లయ్య, మేట్ పెల్లి అధ్యక్షుడు గంప శ్రీను తదతరులు పాల్గొన్నారు

Related Posts