15 రోజుల్లో వంద మంది హత్య: ప్రియాంక ఆంధోళన
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 28
ఉత్తరప్రదేశ్ సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. గడిచిన 15 రోజుల్లో రాష్ట్రంలో 100 మంది హత్య గురయ్యారని అన్నారు. ఈ మేరకు మంగళవారం తన ట్విటర్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేశారు. ‘ఉత్తర ప్రదేశ్‌లో గత 15 రోజుల్లో వంద మంది హత్య చేయబడ్డారు. మూడు రోజుల క్రితం పచౌరి కుటుంబానికి చెందిన ఐదు మృతదేహాలను ఎటాలో అనుమానాస్పద పరిస్థితులలో పోలీసులు కనుగొన్నారు. వారికి ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. దీనికి ఎవరి హస్తం ఉందో కూడా తెలీదు’ అని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేయాలని ప్రియాంక డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే స్థానిక కాంగ్రెస్ నేతలు సైతం వీటిపై విచారణ జరిపించాలని కోరుతున్నారు. మరోవైపు ఈ హత్యలపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందనరాలేదు.