YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆరోగ్యం తెలంగాణ

రాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోలులో పెద్ద ఎత్తున దోపిడి

రాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోలులో పెద్ద ఎత్తున దోపిడి

రాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోలులో పెద్ద ఎత్తున దోపిడి
హైదరాబాద్ ఏప్రిల్ 28
ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్ట నిప్పు కోసం ఇంకొకడు పరుగెత్తాడని ఒక సామెత. దేశం మొత్తం కరోనా వైరస్ తో అల్లాడుతుంటే, ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతూ ఉంటే మరి కొందరు మాత్రం రాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోలులో పెద్ద ఎత్తున దోపిడికి పాల్పడుతున్నారు.145 శాతం లాభాలు వేసుకుని రాపిడ్ టెస్టింగ్ కిట్ల అమ్మకం జరుగుతున్నది. సాక్షాత్తూ ఐసీఎంఆర్ కొనుగోలు చేసిన రాపిడ్ టెస్టింగ్ కిట్లలోనే ఈ భారీ రేట్ ఫిక్సింగ్ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తీరా చూస్తే ఇప్పుడు చైనా నుంచి అధిక ధరలకు దిగుమతి చేసుకున్న ఆ రాపిడ్ టెస్టు కిట్ల వాడకాన్ని దేశం వ్యాప్తంగా నిలిపివేశారు.చైనా నుంచి దిగుమతి చేసుకుని ఐసీఎంఆర్ కు ఇచ్చేందుకు నిర్దేశించిన ఈ రాపిడ్ టెస్టింగ్ కిట్లకు సంబంధించిన దిగుమతిదారుడు, పంపిణీదారుడికి మధ్య తలెత్తిన వివాదం ఢిల్లీ హైకోర్టుకు చేరడంతో ఈ దోపిడి వెలుగులోకి వచ్చింది. దేశంలోకి ఈ కిట్ వచ్చేందుకు రూ.245 రేటు ఉంటుంది. అయితే దాన్ని ఐసీఎంఆర్ కు రూ.600 కు అమ్ముతున్నారు. అత్యవసర సమయంలో అయ్యో పాపం అని కూడా ఆలోచించకుండా ఇంత ధర వసూలు చేసి అధిక లాభం మూటగట్టుకోవాలని చూస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి జస్టిస్ నజ్మీ వాజ్రీ ఆ రేటును రూ.400కు తగ్గించారు. చైనాకు చెందిన వడ్ఫో బయోటెక్ అనే కంపెనీ నుంచి మాట్రిక్స్ లాబ్స్ ఈ కిట్లను దిగుమతి చేసుకుని రేర్ మెటబాలిక్స్ అనే పంపిణీదారుడి ద్వారా ఐసీఎంఆర్ కు సరఫరా చేస్తున్నారు.మొత్తం 5 లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చారు. అందులో 2.24 లక్షలు సరఫరా చేయాల్సి ఉండగా వీటిపై దిగుమతిదారుడికి, పంపిణీదారుడికి మధ్య వివాదం చెలరేగింది. తమకు పంపిణీ దారుడి నుంచి రూ.21 కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ.12.25 కోట్లు మాత్రమే చెల్లించారని మ్యాట్రిక్స్ లాబ్స్ కోర్టుకు తెలిపింది. ఐసీఎంఆర్ నుంచి ఫండ్స్ వచ్చే వరకూ కాకుండా తమకు ముందే చెల్లించాల్సి ఉందని మ్యాట్రిక్స్ లాబ్స్ తెలిపింది.అయితే ముందుగా తమకు కిట్లు ఇవ్వాలని, అప్పుడు తాము ఐసీఎంఆర్ కు పంపి ఆ తర్వాత చెల్లిస్తామని రేర్ మెటబాలిక్స్ చెప్పింది. ఈ లోపు ఐసీఎంఆర్ జరిపిన పరీక్షల్లో కిట్లు మంచివి కాదని తేలింది. ఈ ఆరోపణలను చైనా కంపెనీ తోసిపుచ్చింది. టెస్టు కిట్ల ధరను జీఎస్టీతో కలిపి రూ.400కు  మించకుండా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

Related Posts