గర్భవతులకు పౌష్టిక ఆహారం అందించిన నాదెండ్ల రాజా
నెల్లూరు ఏప్రిల్ 28,
స్థానిక గాంధీనగర్ , వెంకటరెడ్డి నగర్ , కామాక్షమ్మ గుడి తదితర ప్రాంతాలకు చెందిన 30 మంది గర్భవతులకు స్థానిక డివిజన్ వైకాపా నాయకులు నాదెండ్ల రాజా మంగళవారం వివిధ రకాల పండ్లు, పాలు, గుడ్లు, నాణ్యమైన రొట్టెలు తదితర పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు గ్రామీణ నియోజవర్గ పరిధిలోని 30 వ డివిజన్ లో లాక్ డౌన్ కారణంగా దుకాణాలు మూసి వేయడంతో, స్థానిక డివిజన్కు చెందిన గర్భవతులు పౌష్టికాహారాన్ని కొనుగోలు చేసే అవకాశం లేనందున , స్థానిక అంగన్వాడి టీచర్ సూచనలు సలహాల మేరకు ఈ పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకర విషయం అన్నారు. స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనలు డివిజన్లో తనవంతు సేవాకార్యక్రమాలు నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఊపిరి ఉన్నంతవరకు రాజకీయ సేవ జీవితం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి అంకితం అని, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సేవలను కొనియాడారు. ఈ ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ వైకాపా నాయకులు, కార్యకర్తలు, మమతా రెడ్డి, కుమార్, వెంకటేశ్వర్లు నాయుడు, నాగార్జున, విజయ్ మరియు అంగన్వాడీ సిబ్బంది, గర్భవతులు తదితరులు పాల్గొన్నారు.