నేను కూడా హర్జిత్ సింగ్
కడప ఏప్రిల్ 28
పంజాబ్ లో పోలీసు అధికారి హర్జిత్ సింగ్ పై జరిగిన దాడి కి నిరసనగా కడప జిల్లా పోలీసులు మై భీ హర్జిత్ సింగ్ అంటూ వినూత్నంగా హర్జిత్ సింగ్ పేరును నేమ్ ప్లేట్ గా పెట్టుకుని నిరసన తెలిపారు. జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఆదేశాల మేరకు కడప జిల్లా పోలీసులు ఒక్క రోజు మేము కూడా పంజాబ్ పోలీసు అధికారి హర్జిత్ సింగ్ ఘ్ కు మద్దతుగా వారు తమ నేమ్ ప్లేట్ లను హర్జిత్ సింగ్ గా మార్చుకున్నామని ట్రాఫిక్ సి.ఐ శ్రీధర్ నాయుడు అన్నారు. ప్రతి పోలీసు అధికారి కరోనా మహమ్మారిని పారద్రోలాలని తెల్లవారుజామున నుంచి ప్రజల కోసం విధి నిర్వహణలో ఉంటున్నామని కానీ పంజాబ్ లో పోలీసు అధికారి చెయ్యి నరకడం చాలా భాదకరమన్నారు.అందుకే జిల్లా పోలీసులు అందరూ ఎస్సై హర్జిత్ సింగ్ కు మద్దతుగా ఇలా చేయడం జరిగిందన్నారు.జిల్లా ఎస్పీ నుంచి ప్రతి ఒక్క పోలీసు అధికారి ఇలా హర్జిత్ సింగ్ కు మద్దతుగా నిలిచారు.