YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఆన్ లైన్ తరగతులు

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఆన్ లైన్ తరగతులు

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఆన్ లైన్ తరగతులు
హైద్రాబాద్, ఏప్రిల్ 29
ఫ్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నామని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ ప్రకటించారు.15 నుంచి ప్రారంభమైన ఆన్‌లైన్‌ తరగతులపై  సమీక్షా సమావేశం జరిగింది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో 125 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్‌ తరగతుల కోసం 2,645 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. రోజూ మూడు ఆన్‌లైన్‌ తరగతులు బోధిస్తున్నారని వివరించారు. విశ్వవిద్యాలయ పరీక్షా ప్రణాళికల ప్రకారం పూర్తికాని సిలబస్‌ను పూర్తి చేస్తూ, రాబోయే పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇంటర్నెట్‌ సౌకర్యం, ఇతర సమస్యల కారణంగా ఆన్‌లైన్‌ తరగతులకు హాజరుకాని విద్యార్థుల కోసం ప్రతి అధ్యాపకుడు వారి ఉపన్యాసాన్ని రికార్డు చేసి వాట్సాప్‌, ఇతర మార్గాల ద్వారా వారికి సమాచారం అందిస్తున్నారని వివరించారు.విద్యార్థులతో సంభాషించడానికి వివిధ విశ్వవిద్యాలయాల నుంచి విషయ నిపుణులను ఆహ్వానించడం. కోవిడ్‌-19 కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు, నివారణ మొదలైన వాటిపై సందేహాలు తీర్చడానికి వైద్యులను ఆహ్వానించడం.- కోవిడ్‌-19 కారణంగా శారీరక దృఢత్వం, ఒత్తిడి నిర్వహణ ప్రాముఖ్యతపై విద్యార్థులకు మార్గనిర్దేశనం చేయడానికి ఫిజికల్‌ డైరెక్టర్లు సెమినార్‌ తరగతులు నిర్వహిస్తున్నారు.వాట్సాప్‌ గ్రూపుల్లో విద్యార్థులకు అభ్యాస సామగ్రి, పనులను అందిస్తున్నారు.మైక్రోసాఫ్ట్‌ కైజాలాలో సర్వే ఫీచర్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌ అసైన్‌మెంట్లు నిర్వహిస్తున్నారు.యూట్యూబ్‌ చానెల్‌ ప్రారంభించి వారి వీడియోలను అప్‌లోడ్‌ చేసి విద్యార్థులతో లింక్‌లను పంచుకున్నారు.కొన్ని కాలేజీలు ప్రోగ్రామ్‌ కోడింగ్‌ విషయంలో విద్యార్థుల ప్రతిభను చూపించడానికి ప్రత్యేకంగా యూట్యూబ్‌ చానెల్‌ను ఏర్పాటు చేశాయి.

Related Posts