YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో దిశ, దశ లేకుండా పార్టీలు

ఏపీలో దిశ, దశ లేకుండా పార్టీలు

ఏపీలో దిశ, దశ లేకుండా పార్టీలు
విజయవాడ, ఏప్రిల్ 29
లక్ష్యం తెలిస్తే మార్గం వెతకచ్చు. ఇది విజయానికి వర్తించే అతి సాధారణ సూత్రం. కానీ ఏపీ బీజేపీకి మాత్రం ఒక లక్ష్యం అన్నది ఇప్పటివరకూ లేకుండా పోయింది. అధికార పార్టీగా ఎవరు ఉంటే వారిని చీల్చి చెండాడడమే పనిగా పెట్టుకుంది. దాని వల్ల ప్రధాన ప్రతిపక్ష పార్టీకే లాభం చేకూరుతోంది. మరి బీజేపీకి ఎంతో మంది వ్యూహకర్తలు ఉండి కూడా ఏపీలో ఎత్తిగిల్ల లేకపోతోంది. ఆ దిశగా కమలనాధులు ఇప్పటికైతే సీరియస్ గా కూర్చుని చర్చించిన దాఖలాలు లేవు. గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా తెల్లారిలేస్తే మీడియా ముందుకు వచ్చి కామెంట్స్ చేసే మీడియా బేబీలు నయా బీజేపీలో ఎక్కువైపోయారు.బీజేపీలో నాయకులు ఎక్కువ. కార్యకర్తలు తక్కువ అన్న విమర్శ ఎప్పుడూ ఉంది. అదే నిజం అవుతోంది. కూడా. బీజేపీలో ఉన్న వారంతా జన క్షేత్రంలోని ఒకపుడు వెళ్ళేవారు. ఇపుడు అలా కాదు, ఆయారాం గయారాంలు పై స్థాయిలో చేరుతున్నారు. ఇక ఎన్నికల వేళ పొత్తులతో పార్టీకి నాలుగు సీట్లు వస్తే చాలు అనుకుని తృప్తి పడుతున్నారు. నిజానికి ఏపీ రాజకీయ మైదానంలో గత ఆరేళ్ళుగా ఎంతో ఖాళీ ఉంది. కాంగ్రెస్ జాతీయ రాజకీయాల్లో కనుమరుగు అయింది. అదే సమయంలో మోడీ లాంటి ప్రజాకర్షణ కలిగిన నేత దేశ ప్రధానిగా ఉన్నారు. ఇంతటి అవకాశాన్ని కూడా బీజేపీ ఉపయోగించుకోకపోవడం దారుణమే.బీజేపీకి బలం తక్కువగా ఉందంటే దానిని మించి గ్రూపులు ఉన్నాయి. అది కూడా మిగిలిన పార్టీలకు భిన్నం. ఇతర పార్టీలలో వర్గాలు ఉన్నా తమ వారు పార్టీకే మద్దతుగా ఉంటారు. కానీ బీజేపీలో ఉన్నవి టీడీపీ గ్రూపులు, వైసీపీ అనుకూల గ్రూపులు, ఇక కేంద్ర నాయకత్వం గ్రూపులు, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారి గ్రూపులు. ఇలా పార్టీ ఎక్కడికక్కడ చీలిపోవడంతో పార్టీ దేనికీ చెందకుండా ఉంది. ఇక బీజేపీని బలపరచాలన్న కోరిక ఏపీ నాయకులకే లేకుండా పోయిందా? అన్న అనుమానాలు వస్తున్నాయి.ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రాజకీయాల ముందు కమలం తేలిపోతోంది. పైగా వారు ఏది అంటే బీజేపీలోని కొందరు నాయకులు అదే అనుసరిస్తున్నారు. జగన్ ని తిట్టడమే టీడీపీ అజెండాగా ఉంది. దాన్ని అనుసరించడం వల్ల బీజేపీకి ఏం ఒరుగుతుంది అన్నది అసలు ఆలోచించడంలేదు. మంచిని మంచిగా చెప్పి, నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే జనాల్లో పేరు వస్తుంది కానీ బురద జల్లుడు కార్యక్రమం వల్ల పార్టీ విధానాలు కార్యకర్తలకే అర్ధం కావడంలేదు. ఓ విధంగా ఇపుడున్న ఏపీ బీజేపీలో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ రాజకీయాలు కూడా కలగలసిపోయి పార్టీకి దశ, దిశా లేకుండా నడిపిస్తున్నాయని అసలైన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Posts