YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఉద్ధవ్ కి కొత్త టెన్షన్

ఉద్ధవ్ కి కొత్త టెన్షన్

ఉద్ధవ్ కి కొత్త టెన్షన్
ముంబై, ఏప్రిల్ 29
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు కరోనా కంటే పెద్ద సమస్య ముందు కన్పిస్తుంది. కరోనా వైరస్ రాష్ట్రాన్ని ఒకవైపు పట్టి పీడిస్తుంటే మరో వైపు ముఖ్యమంత్రి పదవి ఉంటుందా? ఊడుతుందా? అన్న టెన్షన్ లో ఉద్ధవ్ థాక్రే ఉన్నారు. ఆయన ఏ సభలోనూ ఇప్పటి వరకూ సభ్యుడు కాకపోవడమే ఇందుకు కారణం. ఉద్ధవ్ థాక్రే అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఉద్దవ్ థాక్రే కు ముఖ్యమంత్రి పదవి దక్కిందన్నది అందరికీ తెలిసిందేఅయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన ఆరు నెలలలోపు ఆయన ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంది. శాసనసభకు ఎన్నికయ్యే ఛాన్స్ లేదు. ఇక శాసనమండలికి ఉద్ధవ్ థాక్రే ఎన్నిక కావాల్సి ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరునెలల్లోపు ఉభయ సభల్లో ఒక సభలో సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంది. ఈ గడువు మే 28వ తేదీనాటికి ముగియనుంది.దీంతో ఉద్ధవ్ థాక్రే శాసనమండలి నుంచి సభ్యుడిగా కావాలనుకున్నారు. అయితే మండలి, రాజ్యసభ ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. రాజ్యసభ ఎన్నికలనే కేంద్ర ఎన్నికల కమిషన్ కరోనా కారణంగా వాయిదా వేసింది. మండలి ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. దీంతో మంత్రి వర్గ సమావేశం గవర్నర్ కోటాలో ఉద్ధవ్ థాక్రేను శాసనమండలికి ఎంపిక చేయాలని గవర్నర్ ను కోరారు. అయితే గవర్నర్ కోటాలో కూడా ప్రస్తుతం శాసనమండలి పదవులు ఖాళీగా లేవు. రాష్ట్ర మంత్రివర్గం రెండోసారి కూాడా ఉద్ధవ్ ను మండలికి ఎంపిక చేయాలని గవర్నర్ కు తీర్మానం చేసి పంపారు.గవర్నర్ కోటాలో ఉన్న ఇద్దరు సభ్యుల పదవి కాలం మరో రెండునెలలు ఉంది. ఉద్ధవ్ థాక్రేను నియమించాలంటే వారిలో ఒకరిని తొలగించి నియమించాల్సి ఉంటుంది. దీనిని ప్రతిపక్ష బీజేపీ వ్యతిరేకిస్తుంది. మే 28వ తేదీ నాటికి ఉద్ధవ్ థాక్రే గవర్నర్ కోటాలో శాసనమండలికి ఎన్నిక కాకపోతే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఉద్ధవ్ పరోక్షంగా బీజేపీ నేతలతో మాట్లాడుతున్నారని సమాచారం. నితిన్ గడ్కరీతో తన పని సానుకూలం చేసుకోవలని ఉద్ధవ్ థాక్రే భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
 

Related Posts