YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

డైరక్టర్ సుకుమార్ చేతుల మీదుగా మైత్రివనం మూవీ గ్రీటింగ్ విడుదల...

డైరక్టర్ సుకుమార్ చేతుల మీదుగా మైత్రివనం మూవీ గ్రీటింగ్ విడుదల...

లక్ష్మీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై దర్శకుడు రవిచరణ్ రూపొందిస్తున్న చిత్రం మైత్రివనం. ఫీనిక్స్ ఎల్ వీ ఈ చిత్రానికి ఉపశీర్షిక. విశ్వ, కిషోర్, వృషాలీ, హర్షదా పాటిల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుఖేష్ ఈశ్వరగారి నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న మైత్రీవనం సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రచారంలో వినూత్నంగా ఆలోచించిన చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్ కు ప్రత్యామ్నాయంగా మూవీ గ్రీటింగ్ ను సిద్ధం చేసింది. మైత్రివనం మూవీ గ్రీటింగ్ ను క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ విడుదల చేశారు. మూవీ ఫస్ట్ లుక్ ను కూడా ఆయన ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ...మైత్రివనం ఫీనిక్స్ ఎల్ వీ మూవీ గ్రీటింగ్ బాగుంది. ఫస్ట్ లుక్ లో కొత్తదనం కనిపిస్తోంది. సినిమా వినూత్నంగా తెరకెక్కించి ఉంటారని భావిస్తున్నాను. దర్శకుడు రవి చరణ్ నాకు తెలుసు. సినిమా కోసం బాగా కష్టపడతాడు. అతనికీ, నిర్మాత సుఖేష్ ఈశ్వరగారికి ఆల్ ద బెస్ట్. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. అన్నారు. 

దర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ...చిన్న చిత్రాలకు పరిశ్రమలో ప్రోత్సాహం తక్కువ. ఎన్నో ఆశలతో పరిశ్రమలోకి వస్తున్న మా లాంటి వాళ్లను వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు సుకుమార్ లాంటి మనసున్న దర్శకులు ఉండటం అదృష్టం. నా అభిమాన దర్శకుడు సుకుమార్ నా తొలి చిత్ర మూవీ గ్రీటింగ్ ను విడుదల చేయడం జన్మలో మర్చిపోలేను. మూవీ గ్రీటింగ్ చూసి ఆయన చెప్పిన మాటలు మాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఇక మైత్రివనం సినిమా గురించి చెప్పాలంటే దర్శకుడిగా నా తొలి చిత్రం. కొన్ని వాస్తవ సంఘటనలతో స్ఫూర్తి పొంది ఈ కథను రాసుకున్నాను. ఈ విశ్వంలో మనిషి తలచుకుంటే ఏదైనా చేయగలడు, ఎంత కష్టమైన లక్ష్యాన్ని అయినా సాధించగలడు, అద్భుతాలు సృష్టించగలడు అని చెప్పేందుకు చేసిన ప్రయత్నమే ఈ మైత్రివనం. కథకు సరిపోయేలా సహజత్వానికి దగ్గరగా సినిమాను చిత్రీకరించాము. కొన్ని సహజమైన ప్రదేశాలు, మరికొన్ని సెట్స్ లో చిత్రాన్ని రూపొందించాము. కథను పూర్తిగా నమ్మి ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని తెరకెక్కించాము. ఈ క్రమంలో నాకు సహకారాన్ని అందించిన నిర్మాత సుఖేష్ ఈశ్వరగారి గారికి, నటీనటులు, సాంకేతిక బృందానికి కృతజ్ఞతలు చెబుతున్నాను. అన్నారు.

 నిర్మాత సుఖేష్ ఈశ్వరగారి మాట్లాడుతూ...యువతకు నచ్చేలా మంచి సందేశాన్ని ఇస్తూ మైత్రివనం సినిమాను నిర్మించాము. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. కథలో ఆశ్చర్యపరిచే అంశాలుంటాయి. దర్శకుడు కథ చెప్పినప్పుడు బాగుంది అనిపించింది. కానీ  ఆ కథను చెప్పినదాని కంటే రవి చరణ్ అద్భుతంగా తెరకెక్కించారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే సినిమా అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. విజువల్ ఎఫెక్టులు ఆకట్టుకునేలా ఉంటాయి. పాటలు బాగా వచ్చాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు తుది దశకు వచ్చాయి. వాటిని పూర్తి చేసి మే నెలలో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాము. అన్నారు.

జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, చంటి, వేణు, గెటప్ శ్రీను, రాజ్ బాలా, శరత్ కుమార్, ప్రసన్న తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - పీఆర్, ఎడిటర్ - కిషోర్ మద్దాలి, సినిమాటోగ్రఫీ - పరంధామ, కొరియోగ్రాఫర్ - ఆర్కే, విజువల్ ఎఫెక్ట్ - కార్టూనిస్ట్ నవీన్, కథా స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం - రవి చరణ్. ఎం

Related Posts