ఆకాల వర్షంతో తడిసిన వరిధాన్యం
లబోదిబోమంటున్న రైతులు
రాజన్న సిరిసిల్ల ఏప్రిల్ 29,
రాజన్న సిరిసిల్ల జిల్లా ఏల్లారెడ్డిపేట మండలంలో మంగళవారం కురిసిన ఆకాల వర్షానికి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిపోయాయి. కోతకు వచ్చిన వరిచేళ్ళు నేలకోరిగాయి . దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఐకెపి సెంటర్లలో .తూకం వేసి రైస్ మిల్లులకు తరలించడానికి సిద్దం చేసిన వరిధాన్యం భస్తాలు కూడా తడిసిపోయాయి. తూకం చేయడానికి సిద్దం చేసిన మ్యాచర్ వచ్చిన వరిధాన్యం ఆకాల వర్షానికి తడిసి పోవడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇన్నీ రోజులుగా వరిధాన్యం ప్రతి ధినం ఎండబోసి ఆరబెట్టినా పలితం లేకుండా పోయిందనీ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తడిసిన వరిధాన్యం ను రైస్ మిల్లర్లు కొనుగోలు చేసే విధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు.