ఏపిలో ప్రత్యేక హోదా పోరు తారాస్ధాయికి చేరుకుంది. ఏపీ స్వయం ప్రతిపత్తి కోసం అన్నీ రాజకీయ పార్టీలు కేంధ్రం తీరును దుమ్మెత్తి పోస్తూ ప్రత్యేక హోదా నినాదాలతో ఏపీకి అట్టుడికిస్తున్నారు. సత్యగ్రహా దీక్షలతో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్న హస్తం పార్టీ విశాఖలో రహదారి దిగ్బదించి ప్రత్యేక హోదా కోసం పట్టుబిగిస్తోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్షలతో కేంధ్రంపై సమరభేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు అయిన వెంటనే ఏపీ ప్రత్యేక హోదాపై మొదటి సంతకాన్ని చేసి ఏపీ రాష్ట్రాభివృద్దికి కట్టుబడి ఉంటుందనే సంకేతాలను పిసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విశాఖలో వ్యక్తం చేశారు. జీవిఎంసీ గాంధీ విగ్రహం కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టి దీక్షల్లో పాల్గోన్న రఘువీరా రెడ్డి కేంధ్రం తీరుపై తీవ్రస్ధాయిలో ద్వజమెత్తారు. ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదాను సాదించే వరకూ ఉద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరించారు.