వరి ధాన్యం, మక్కల తరలింపు, నిల్వలు ఉంచేందుకు గోదాముల ఏర్పాటుపై మంత్రి పువ్వాడ సమీక్ష
ఖమ్మంఏప్రిల్ 29
ఖమ్మం జిల్లాలో రైతులు పండించిన వరిధాన్యం, మక్కలు కొనుగోలు మరియు నిల్వలు, కొన్న ధాన్యంకు సరిపడు గోదాములపై బుధవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ టీ టీ డీ సీ భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మార్కెటింగ్, వ్యవసాయం, మార్కుఫెడ్, వెర్ హౌసింగ్, సివిల్ సప్లై, సహకార శాఖ జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతుల నుండి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం, మిగిలి ఉన్న ధాన్యం, గన్ని బ్యాగ్స్ కొరత, కొనుగోలు చేసిన ధాన్యంను తక్షణమే గోదాములకు తరలించుట, ధాన్యం నిల్వలకై గోదాములు ఏర్పాటు, సరుకు రవాణా తదితర అంశాలపై అధికారులతో మాట్లాడారు. సమీక్షలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, ఎమ్మెల్సీ బలసాని లక్ష్మీనారాయణ , మేయర్ పాపాలాల్ , జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు , ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య , కందాల ఉపేందర్ రెడ్డి , రాములు నాయక్ , రైతు సమన్వయ సమితి చైర్మన్ నల్లమల వెంకటేశ్వర రావు , మార్కుఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ తదితరులు ఉన్నారు.