YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎవరూ రాకపోయిన పోరాటం చేస్తాం : సీఎం చంద్రబాబు

ఎవరూ రాకపోయిన పోరాటం చేస్తాం : సీఎం చంద్రబాబు

లోక్ సభ నిరవధిక వాయిదా పడింది,  అయినా మళ్లీ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి విభజన చట్టంలోని హామీల పై చర్చ జరపాలి. అందుకోసం అసెంబ్లీ తీర్మానం చేస్తుంది.  రెండో అఖిలసంఘ సమావేశం నిర్వహిస్తున్నాం, ఆ సంఘానికి ఎవరు హాజరు కాకపోయినా ప్రజల పక్షాన మేమే పోరాడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసారు. నెల్లూరు , తిరుపతి , గుంటూరు సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో హామీలు ఇచ్చారు. న్యాయం చేయమని అడిగితే ఎదురు దాడి చేస్తున్నారు. మొన్న అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తే మూడు పార్టీలు కావాలనే హాజరుకాలేదని విమర్శించారు. బీజేపీ చేసిన అన్యాయం పై సమాధానం చెప్పాల్సి వస్తుందని వాళ్లు రావడం లేదు.  వైసీపీ కావాలనే కుట్ర రాజకీయాలు చేస్తూ అఖిల పక్ష సమావేశానికి రావడం రాలేదు. అందుకే మాకు న్యాయం చేసేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. కొన్ని రాజకీయ పార్టీలు సొంత రాజకీయ ఎజెండాలతో రాజకీయాలు చేస్తున్నారు. అఖిల పక్ష సమావేశానికి ఎవరు వచ్చినా రాకపోయినా సరే నిర్వహిస్తాం. కేంద్రంతో పోరాడుతూనే ఉంటామని అన్నారు. ఈరోజు సైకిల్ ర్యాలీలు విజయవంతమయ్యాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ రాష్ట్ర నికి జరిగిన అన్యాయం పై గళమెత్తున్నారు.  నేను పోరాటం చేస్తుంది...మీరు చేస్తుంది కేంద్రం పైనే ఎందుకు రారు అని ప్రశ్నిస్తున్నానని అయన అన్నారు.

Related Posts