కరోనా కిరీటం పెడుతున్న పోలీసులు
గుంటూరు ఏప్రిల్ 29
జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజలెవరూ అనవసరంగా బయటకు రావొద్దంటూ పదే పదే విజ్ఞప్తి చేస్తున్న పోలీసులు, కొన్ని చోట్ల వెరైటీ శిక్షలు వేస్తూ వాళ్ల మళ్లీ రోడ్ల మీదకు రాకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే మేం తప్పు చేశాము అంటూ పలువురు వాహనదారులతో ఐదు వందల సార్లు పేపర్ మీద రాయించి శిక్షిస్తున్నారు. తాజాగా ఓ శిక్షను అమలు చేస్తున్నారు. గుంటూరు రూరల్‌కు సంబంధించిన కొల్లూరు పోలీసులు ఈ రకమైన వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న సందర్భముగా లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండ రోడ్ల పైకి వచ్చేవారికి ఈ రకమైన వినూత్న శిక్ష వేస్తున్నారు. మాస్కులు లేకుండా బయటకు వస్తున్న వాళ్లకు మిస్టర్ కొల్లూరు అవార్డు ఇచ్చి కరోనా కిరీటం పెట్టి పోలీసులు సత్కరించారు. వారితో స్ధానికులకు శానిటైజర్ వాడుకునేలా అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో తప్ప బయటకు వస్తే శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు.