ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా సర్కిల్‌లో రూ. 124కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది పనులను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు శనివారం నాడు ప్రారంభించనున్నారు. రూ. 13.64కోట్లతో నిర్మించిన సింగం చెరువు తండా డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం, రూ. 95.90కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఏడు రహదారుల విస్తరణ, నిర్మాణ పనులకు శంకుస్థాపన, రూ. 10.98కోట్ల వ్యయంతో నిర్మించిన మూడు మంచినీటి సరఫరా రిజర్వాయర్లను మంత్రి కె.టి.ఆర్ ప్రారంభించనున్నారు.అలాగే నాచారంలోని సింగం చెరువు తండాలో రూ. 13.64 కోట్ల వ్యయంతో నిర్మించిన 176 డబుల్ బెడ్‌రూం ఇళ్లను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ప్రారంభించనున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్, నాచారం, మౌలాలి తదితర ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, నూతన రోడ్ల నిర్మాణం పటిష్టతకు రూ. 95.90కోట్ల వ్యయంతో చేపట్టే పనులను మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ప్రారంభించనున్నారు. రెండుఎకరాల విస్తీర్ణంలో ఉన్న సింగం చెరువు తండా బస్తీలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులకు 2016 జనవరిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహ్మూద్ అలీతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేశారు. జి+3 పద్దతిన చేపట్టిన ఈ డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను జీహెచ్ఎంసీ శరవేగంగా పూర్తిచేసింది. మొత్తం 11 బ్లాకుల్లో చేపట్టిన ఈ డబుల్ బెడ్‌రూం ఇళ్ల కాలనీలో అంతర్గత సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్లు, మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, చిన్న పిల్లల ఆట వస్తువుల ఏర్పాటు, కంపోస్టింగ్ గుంతల నిర్మాణం, ఎల్.ఇ.డి లైటింగ్ సౌకర్యాలను కల్పించారు. నాచారం ప్రధాన రహదారి నుండి డబుల్ బెడ్‌రూం ఇళ్ల కాలనీ వరకు సీసీ రోడ్డు కూడా నిర్మించారు. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు బెడ్‌రూంలు ఒక హాల్, కిచెన్, రెండు బాత్‌రూమ్‌లను నిర్మించారు. మొత్తం 176 డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించిన ఈ సింగం చెరువు తండాలో 95శాతం మంది లబ్దిదారులు గిరిజనులే ఉండడం ఈ కాలనీ ప్రత్యేకత. దేశంలో మరెక్కడా కేవలం గిరిజనులకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం జరగలేదు. నగరంలో ఐడీహెచ్‌కాలనీ అనంతరం డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం ప్రారంభం సింగం చెరువు తండాలోనే కావడం, అది లబ్దిదారులందరూ నిరుపేద గిరిజనులు ఉండడం ఈ కాలనీ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
రూ. 33.30 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు ఎన్.ఎఫ్.సి క్రాస్ రోడ్స్ వద్ద శంకుస్థాపన
* కుషాయిగూడ నుండి ఘట్‌కేసర్ వరకు మూడు కిలోమీటర్ల రహదారి విస్తరణ, మరమ్మతులు
* ఎన్.ఎఫ్.సి క్రాస్ రోడ్ నుండి చర్లపల్లి రైల్వే స్టేషన్ వరకు ఐదు కిలోమీటర్ల రోడ్డు విస్తరణ, పటిష్టత పనులు
* ఎన్.ఎఫ్.సి క్రాస్ రోడ్ నుండి ఐఓసీఎల్, చెంగిచర్ల మీదుగా ఆర్టీసీ జోనల్ డిపో వరకు విస్తరణ, పటిష్టత పనులు
రూ. 19.70 కోట్ల వ్యయంతో ఐ.డి.ఏ నాచారం నుండి ఉప్పల్ స్టేడియం వరకు ఉన్న రహదారి పటిష్టత, విస్తరణ పనులు
రూ. 7.60కోట్ల వ్యయంతో మిర్జాలగూడ నుండి నేరేడ్‌మెట్ క్రాస్‌రోడ్ వరకు, ఉత్తమ్ నగర్ నుండి జెడ్.టీ.ఎస్ వరకు రహదారుల ప్రత్యేక మరమ్మతులు
రూ. 19.40కోట్ల వ్యయంతో బోయిన్‌పల్లి నుండి తిరుమలగిరి మీదుగా మౌలాలి వరకు రహదారికి మరమ్మతులు
రూ. 16కోట్ల వ్యయంతో హైదరాబాద్ మౌలాలి మార్గంలో రహదారుల మరమ్మతులు పనులకు లాలాపేట్ వద్ద శంకుస్థాపన
*రూ. 3.50కోట్లతో సివరేజ్ లైన్ నిర్మాణం*
కేంద్రంలోని హౌజింగ్ బోర్డు కాలనీ ఫేజ్-1లో రూ. 3.50కోట్ల వ్యయంతో నిర్మించనున్న 600ఎంఎం వెడల్పుతో సీవరేజ్ నిర్మాణ పనులను ప్రారంభం చేయనున్నారు. రాజరాజేశ్వరి కృష్ణానగర్ నాలా వరకు 21మీటర్ల పొడవు నిర్మించనున్న ఈ సీవరేజ్ లైన్ల వల్ల కృష్ణానగర్, మంగాపూరం, ఇందిరానగర్, లక్ష్మినగర్, డైమండ్ హిల్ కాలనీలోని 38,956 మందికి సౌకర్యవంతంగా ఉంటుంది.
*రూ. 10.98కోట్లతో నిర్మించిన మూడు రిజర్వాయర్ల ప్రారంభం*
రూ. 10.98కోట్ల వ్యయంతో నిర్మించిన మూడు మంచినీటి రిజర్వాయర్లను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ప్రారంభించనున్నారు. రూ. 4.64కోట్లతో సైనికపురి సమీపంలోని రాధిక థియేటర్ వద్ద 7మిలియన్ లీటర్ల కెపాసిటి గల రిజర్వాయర్లను ప్రారంభిస్తున్నారు. దాదాపు 32 వేలమందికి మెరుగైన మంచినీటి సరఫరా ఈ రిజర్వాయర్లతో సౌకర్యం కానుంది.
రూ. 4.89కోట్లతో 7మిలియన్ లీటర్ల కెపాసిటి కలిగిన మరో రిజర్వాయర్‌ను ప్రారంభిస్తున్నారు. ఈ రిజర్వాయర్ ప్రారంభం వల్ల 4వేల నల్లా కనెక్షన్లకు మెరుగైన మంచినీటి సరఫరా మెరుగై 26,500మందికి లబ్ది చేయనుంది.
రూ. 1.65కోట్ల వ్యయంతో గోపాల్‌రెడ్డి నగర్‌లో రెండు మిలియన్ లీటర్ల కెపాసిటితో నిర్మించన రిజర్వాయర్‌ను ప్రారంభించనున్నారు. మొత్తం ముడు రిజర్వాయర్ల ప్రారంభంతో కేంద్ర సర్కిల్‌లోని దాదాపు 50కాలనీలలో మంచినీటి సరఫరా మెరుగవనుంది.