YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆన్ లైన్ లో బాధ్యతలకు జగన్ ఆమోదం

ఆన్ లైన్ లో బాధ్యతలకు జగన్ ఆమోదం

ఆన్ లైన్ లో బాధ్యతలకు జగన్ ఆమోదం
విజయవాడ, ఏప్రిల్ 29
మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహహ్మణ్యంకు ఉద్యోగ విరమణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. బాపట్లలోని మానవ వనరుల అభివ్రుద్ధి శిక్షణా సంస్థ డైరెక్టర్‌గా.. ఆన్‌లైన్ ఛార్జ్ తీసుకుని పదవీ విరమణ చేసేలా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం.. లాక్‌డౌన్ కారణంగా స్వయంగా ఛార్జ్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే ఆయనకు ఈ వెసులుబాటు కల్పించారు.. ఈ నెలఖారుకు సుబ్రహ్మణ్యం పదవీ విరమణ కాబోతున్నారుఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్ పదవి నుంచి తప్పించి గతేడాది నవంబర్‌లో ప్రభుత్వం బదిలీ చేసింది. సుబ్రహ్మణ్యంను గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా నియమించారు. ఎల్వీని సీఎస్‌గా తప్పించడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించకుండానే ఆయన తన ఉద్యోగానికి సెలవు పెట్టారు. తన సర్వీస్ కూడా తక్కువగానే ఉండటంతోనే సుబ్రహ్మణ్యం బాధ్యతలకు దూరంగా ఉన్నారనే వార్తలు వినిపించాయి.

Related Posts