YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా దేశీయం విదేశీయం

విలక్షణ నటుడు ఇక లేడు

విలక్షణ నటుడు ఇక లేడు

విలక్షణ నటుడు ఇక లేడు
ముంబై, ఏప్రిల్ 29
ప్రముఖ బాలీవుడు నటుడు ఇర్ఫాన్ కన్నుమూశారు. ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. ఆయనకు భార్య సుతాప, ఇద్దరు కుమారులు బబిల్, అయాన్ ఉన్నారు. ఇర్ఫాన్‌ 2018లో న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్) బారిన పడిన సంగతి తెలిసిందే. దీనికి ఆయన లండన్‌లో చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ నుంచి కోలుకుని 2019 సెప్టెంబర్‌లో ఇండియాకు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ముంబైలో చికిత్స పొందుతున్నారు. అయితే, మంగళవారం అకస్మాత్తుగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్పించారు. నిన్నటి నుంచి ఇర్ఫాన్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, బుధవారం ఆయన ఆరోగ్యం మరింత విషమించి మృతిచెందినట్టు ఇర్ఫాన్ కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని అన్నారు. కాగా, ఇర్ఫాన్ మృతిపట్ల బాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. ఇర్ఫాన్ మృతిని ఖరారు చేస్తూ దర్శకుడు సుజిత్ సర్కార్ మొదటిగా ట్వీట్ చేశారు. ఇర్ఫాన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.సలామ్ బాంబే’ సినిమాతో 1988లో ఇర్ఫాన్ ఖాన్ బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ‘కఖ్బూల్’ సినిమాతో ఇర్ఫాన్ ఖాన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో నటనకు ఆయన విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ‘పాన్ సింగ్ తోమార్’ సినిమాలో నటనకు గాను ఇర్ఫాన్ ఖాన్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ‘సైనికుడు’ సినిమాతో టాలీవుడ్‌‌కు కూడా పరిచయమయ్యారు. అయితే, తెలుగులో ఆయన చేసిన సినిమా ఇదొక్కటే. హిందీతో పాటు బ్రిటిష్, హాలీవుడ్ సినిమాల్లోనూ ఇర్ఫాన్ నటించారు. ‘స్లమ్‌డామ్ మిలియనీర్’, ‘ఇన్ఫెర్నో’, ‘లైఫ్ ఆఫ్ పై’ చిత్రాలతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఇర్ఫాన్ ఖాన్ ఆఖరిగా నటించిన చిత్రం ‘అంగ్రేజి మీడియం’. కరీనా కపూర్ ఖాన్, రాధికా మదన్, దీపికా దోబ్రియాల్ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రం మార్చి 13న విడుదలైంది. అయితే, లాక్‌డౌన్ కారణంగా ప్రదర్శనలు ఆగిపోవడంతో సినిమాకు నష్టాలు వచ్చాయి. దీంతో నిర్మాతలు డిజిటల్ ప్లాట్‌ఫాంలో విడుదల చేసేశారు. కాగా, ఈనెల 25న ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీదా బేగం కన్నుమూశారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆమె అంత్యక్రియలు జరిగాయి. అయితే, ముంబైలో ఉన్న ఇర్ఫాన్ లాక్‌డౌన్ కారణంగా తల్లి అంత్యక్రియలకు వెళ్లలేకపోయారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తల్లిని కడసారిగా చూసుకున్నారు. ఇప్పుడు ఆ తల్లి దగ్గరికే ఇర్ఫాన్ వెళ్లిపోవడం బాధాకరం
ఇర్ఫాన్ ఖాన్ మృతికి ప్రముఖుల సంతాపం
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ బుధవారం (ఏప్రిల్ 29న) కన్నుమూశారు. మంగళవారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన 53 సంవత్సరాలు. ఇర్ఫాన్ ఖాన్ మృతితో హిందీ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మృతికి పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటీనటులు ప్రియాంక చోప్రా, టైగర్ ష్రాఫ్, సంగీత దర్శకుడు అమిత్ త్రివేది, భారత మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, మహమ్మద్ కైఫ్ సహా పలువురు ఇర్ఫాన్ మృతిపట్ల ట్విట్టర్ ద్వారా సంతాపం ప్రకటించారు.ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూశారనే వార్త విని చాలా బాధపడ్డాను. విలక్షణ, ప్రతిభావంతుడైన నటుడు. ప్రపంచ సిసినిమా, టీవీ రంగంలో భారత్‌కు ఆయన ప్రముఖ బ్రాండ్ అంబాసిడర్. ఆయన లేని లోటు తీరనిది. ఆయన కుటుంబం, స్నేహితులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. - రాహుల్ గాంధీఇర్ఫాన్ ఖాన్ విలక్షణ నటుడు. ఆయన మృతిచెందడం బాధాకరం. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి. - కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్

Related Posts