YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అఖిల పక్ష సమావేశం నిర్వహించండి

అఖిల పక్ష సమావేశం నిర్వహించండి

అఖిల పక్ష సమావేశం నిర్వహించండి
హైద్రాబాద్, ఏప్రిల్ 29
తెలంగాణలో ఎక్కువగా కరోనా పరీక్షలు జరగడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కరోనా పరీక్షలు చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రతి రోజూ రాష్ట్రంలో 2 వేల కరోనా పరీక్షలు చేసే సౌకర్యం ప్రతి చోట కేంద్రం కల్పించిందని అన్నారు. కరోనా స్థితిగతులపై ప్రభుత్వం వైద్య నిపుణులు, అఖిల పక్షాన్ని పిలిచి సమావేశం ఏర్పాటు చేయాలని, వారి సలహాలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.‘‘ఏప్రిల్ 25, 26, 27 తేదీల్లో 26 మంది చనిపోయారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం 24, 25, 26, 27 తేదీల్లో 25 మందే చనిపోయారని ప్రకటించింది. ఈ లెక్కలో తేడా ఉంది. అదేంటో స్పష్టం చేయాలి. జ్వరంతో ఓ వ్యక్తి ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే వారు గాంధీకి పంపారు. గాంధీలో పరీక్ష జరిపితే అతనికి నెగటివ్ అని తేలింది. మళ్లీ ప్రైవేటు ఆస్పత్రికి పంపితే అనుమానం వచ్చిన డాక్టర్ బ్లడ్ శాంపిల్ తీసి నిమ్స్‌లోని కరోనా పరీక్షా కేంద్రానికి పంపారు. అక్కడ అతనికి పాజిటివ్ అని వచ్చింది. అదే డాక్టర్లు మళ్లీ గాంధీలో చేర్చారు. ఈ వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా అక్కడే అడ్మిట్ చేశారు. అయితే, 26 తేదీన ఆ వ్యక్తి చనిపోయాడు. ప్రభుత్వం అతను కరోనా వల్ల చనిపోయాడని చెప్పకుండా దాస్తోంది.’’జోగులాంబ గద్వాల, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో విపరీతంగా కేసులు నమోదవుతోంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులను పంపింది. ఆ తర్వాతి నుంచి కేసులు తగ్గిపోయాయి. వీరిని చూసి కరోనా పారిపోయిందా? టెస్టులను తగ్గించేసి కరోనా తగ్గిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం భ్రమ కల్పిస్తోంది.‘‘త్వరలో రంజాన్ ఉన్నందున కేసీఆర్ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోంది. ముస్లింలకు ప్రత్యేక వసతులు, ఇబ్బంది కలిగించవద్దన్న కుట్రతోనే సీఎం ఇలా సడలింపు ఇస్తున్నారు. తెలంగాణలో లాక్ డౌన్ ఏ విధంగా అమలవుతోంది? జిల్లాల్లో జనాలు యథేచ్ఛగా తిరుగుతున్నారు. ముఖ్యమంత్రికి సిగ్గుంటే సమాధానం చెప్పాలి.’’‘‘ముఖ్యమంత్రి ఒవైసీ మెప్పు పొందేందుకు మైనారిటీ సంతుష్టీకరణ విధానాలను అవలంబిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో సమాజంలో చీలిక ఏర్పడుతుంది. అన్ని వర్గాలను సమానంగా చూడాలని మేం డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ హోం మినిస్టర్ అయితే ఏం మాట్లాడడు.’’ అని బండి సంజయ్ విమర్శలు చేశారు. బాధ్యతలు స్వీకరించిన సంజయ్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బుధవారం (ఏప్రిల్ 29న) బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఈ రోజు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో ‘శ్రీ బండి సంజయ్ గారికి’ నా తరుపున , జన సైనికులు మరియు జనసేన పార్టీ నాయకులూ అందరి తరుపున మనః పూర్వక శుభాకాంక్షలు’’ అని పవన్ ట్వీట్ చేశారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మార్చి 11న సంజయ్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. కానీ కరోనా ప్రభావంతో దాన్ని రద్దు చేశారు.

Related Posts