YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

తడిచిన ధాన్యం కొంటాం

తడిచిన ధాన్యం కొంటాం

తడిచిన ధాన్యం కొంటాం
వరి కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించిన మంత్రి అల్లోల
నిర్మల్, ఏప్రిల్ 29
అకాల వర్షంతో నష్టపోయిన రైతు అధైర్యపడవద్దని, తడిసిన ధాన్యంను కొనుగోలు చేసి ప్రభుత్వం ఆదుకుంటుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం చిట్యాల్ గ్రామంలో  వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి అల్లోల ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కొనాలని సిఎం కెసిఆర్ ఆదేశించారన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను మద్దతు ధరకు కొంటాం, రైతులు పండించిన చివరి ధాన్యం గింజలను కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుందని వెల్లడించారు. రైతులు పండించిన ధాన్యం విక్రయించేందుకు గాను  కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లాలో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. లక్ష మొట్రిక్ టన్నులకు గానూ ఇప్పటి వరకు 34 వేల మొట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేశామన్నారు. ధాన్యం స్టోరేజీ కోసం రైస్ మిల్లర్లు, ఎఫ్సిఐతో ప్రభుత్వం  చర్చించినట్లు చెప్పారు. గన్ని బ్యాగ్ ల కొరత లేకుండా చూస్తున్నామన్నారు. అంతకుముందు సోఫినగర్ లో మొక్కజొన్నలు నిల్వ చేసిన ఓ రైస్ మిల్ ను  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ నల్లా వెంకట్రామ్ రెడ్డి, ఎఫ్ఎస్సాసీయస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మార్క్ ఫెడ్ డీయం ప్రవీణ్ రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related Posts