YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం దేశీయం

రాహుల్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన నిర్మలా సీతారామన్‌

రాహుల్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన నిర్మలా సీతారామన్‌

రాహుల్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన నిర్మలా సీతారామన్‌
 న్యూఢిల్లీ ఏప్రిల్ 29
ఉద్దేశ పూర్వక రుణ ఎగవేతదారుల బకాయిల మాఫీ ఆరోపణలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ముఖ్యంగా రుణాలను ఎగవేసిన వారిలో ఎక్కువగా బీజేపీ మిత్రులు ఉన్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన దాడికి ఆమె ట్విటర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.  రాహుల్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన నిర్మలా సీతారామన్‌ బ్యాంకు రుణాల మాఫీ విషయంపై  రాహుల్ వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని మండిపడ్డారు. ఈ విషయంలో అవగాహన కోసం కాంగ్రెస్ హాయంలో ఆర్థికమంత్రిగా ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను సంప్రదించాలని కోరారు. బ్యాంకులు ఎవరి రుణాలను మాఫీ చేయలేదని, రుణాలు చెల్లించే సామర్థ్యం ఉన్నప్పటికీ కావాలనే ఎగగొట్టినవారిని ‘విల్ ఫుల్ డీఫాల్టర్లు’గా ఆర్‌బీఐ ఆయా కేటగిరీల్లో చేర్చిందని వివరించారు. 2009-10, 2013-14 మధ్య షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు 1,45,226 కోట్లను మాఫీ చేశాయని గుర్తు చేశారు. రిజర్వ్ బ్యాంకు నిర్దేశించిన నాలుగేళ్ల ప్రొవిజనల్ సైకిల్ ప్రకారం ఎన్‌పిఎలకు (నిరర్ధక ఆస్తులు) కేటాయింపులు చేసినట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. నాటి యూపీఏ ఫోన్ బ్యాంకింగ్ ద్వారా లాభపడినవారే డిఫాల్టర్లుగా మారారని నిర్మలా సీతారామన్ ఎదురు దాడికి దిగారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్‌బీఐ గవర్నరుగా ఉన్న రఘురామ్ రాజన్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఉటంకించారు. 2006-2018 మధ్య కాలంలోనే మొండి రుణాలను ఎక్కువగా నమోదయ్యాయని పేర్కొన్నారు.  
 

Related Posts