YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

వంద శాతం వరిని కొనుగోలు చేయాలి మంత్రి వేముల

వంద శాతం వరిని కొనుగోలు చేయాలి మంత్రి వేముల

వంద శాతం వరిని కొనుగోలు చేయాలి
మంత్రి వేముల
హైదరాబాద్ ఏప్రిల్ 29
వరి ధాన్యం కొనుగోలు పై రాష్ట్ర రోడ్లు- భవనాలు, హౌసింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా పీఏసీ చైర్మన్ లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో మంత్రి తో పాటు డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి,వైస్ ఛైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తో పాటు పీఏసీ చైర్మన్ లు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అదేశాల మేరకు రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసి రైతుకు భరోసా కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని అన్నారు. దీనికోసం పీఏసీ చైర్మన్లు ఎక్కడికక్కడ కథనాయకుని పాత్ర పోషించాలన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నా..రైతు పండించిన పంటను ముఖ్యమంత్రి పూర్తిగా కొనుగోలు చేయాలని నిర్ణయించారన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా మీకు క్షేత్రస్థాయిలో వాటిపై అవగాహన ఉంటుంది,రైతులతో మంచి సంబంధాలు ఉంటాయి కావున మీరే సమస్యల పరిష్కారానికి కథనాయకుని వలె వ్యవహరించాలన్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి మనకు రెగ్యులర్ గా వచ్చే హమాలీలు రావడం లేదన్నారు. ఏ గ్రామానికి ఆ గ్రామంలో లోకల్ హమాలీలను తయారు చేసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు.ధాన్యం సేకరణ కు మనం పెట్టుకున్న టార్గెట్ కు 20 శాతం ఇప్పటికే సేకరించమన్నారు. లారీల కొరత వల్ల ధాన్యం తరలింపుకు రవాణ  ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గ్రామాల్లో ఉన్న లోకల్ ట్రాక్టర్ లను, లారీలను గుర్తించి వాటిని వినియోగించుకోవాలని సూచించారు. కడ్తా పేరుతో రైతులను ఇబ్బంది పెడ్తున్న రైస్ మిల్లర్ల పై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.మండల స్థాయిలో నోడల్ ఆఫీసర్లు,జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ చేస్తారన్నారు. మన పని అనుకోని పీఏసీ చైర్మన్ లు ఈ కష్ట కాలంలో పనిచేయాలని కోరారు. మీకు ఏమైనా సమస్యలు ఎదురైతే ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని నేరుగా నన్ను సంప్రదించవచ్చని అన్నారు. 354 కొనుగోలు కేంద్రాల్లో 287 కేంద్రాల్లో మంగళవారం వరకే 1.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందన్నారు. ఇందులో 90శాతం ధాన్యం రైస్ మిల్లర్లకు అందించామని..ఇంకా 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రైసు మిల్లర్లు తీసుకోవాల్సి ఉన్నదన్నారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా  ఒక పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నామని దానికి అనుగుణంగా పనిచేయాలని కోరారు. పీఏసీ చైర్మన్లు గ్రామాల్లో కథనాయకులుగా వ్యవహరించి క్షేతస్థాయిలో రైతు కోసం మీరే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణ మన రాష్ట్రంలో జరిగినట్లు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదని,కరోనా ను సాకుగా చూపి మిగతా ఏ రాష్ట్రం కూడా రైతు పండించిన పంటను కొనడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి కాబట్టి రైతు శ్రేయస్సు కోసం ఆలోచన చేసి రైతు పండించిన పంటను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. తెల్ల జొన్నలు, పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకొన్నామని ఇందులో పొద్దుతిరుగుడును కేంద్రం కేవలం 25 శాతం మాత్రమే కొంటుందన్నారు. మిగతా 75 శాతం రాష్ట్ర ప్రభుత్వమే సేకరిస్తుందన్నారు.తెల్లజొన్నలను వంద శాతం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. సొసైటీ చైర్మన్ లు హమాలీలను సమకూర్చుకున్న విధంగానే.. మిల్లర్లు హమాలీల కొరత ఉన్నదని అన్ లోడ్ చేసుకోవడం లేదని మిల్లర్లకు కూడా సొసైటీ చైర్మన్లు హమాలీలను సమకూర్చాలన్నారు.డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ..మిల్లర్లు అన్ లోడ్ కోసం హమాలీల ఖర్చులు ఇవ్వాలని తెలుపగా..  హమాలీల ఖర్చు కచ్చితంగా ఆయా మిల్లర్లే భరించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు.ఖర్చులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. డిసిసిబి వైస్ ఛైర్మన్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ..ట్రాన్స్పోర్ట్ కోసం ట్రాక్టర్లు,లారీల పేమెంట్ మిల్లర్లు భరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వారి పేమెంట్ కు పూర్తి బాధ్యతపై కలెక్టర్ హామీ ఇచ్చారు.
రైస్ మిల్లర్లకు అన్ లోడ్ కోసం 24 గంటల టైం కేటాయించారని.. రానున్న రోజుల్లో 20 గంటలకు,18 గంటలకు తగ్గిస్తామన్నారు. పీఏసీ చైర్మన్లు నోడల్ ఆఫీసర్లకు హమాలీలను, లోకల్ ట్రాక్టర్, లారీలను అటాచ్ చేయాలని మంత్రి సూచించారు. ఈ కష్ట కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు ధాన్యం కొనుగోలు చేసే విధంగా బాధ్యతలు తీసుకోవాలని పీఏసీ చైర్మన్లకు విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి అన్నారు. కడ్తా పేరుతో రైతులను ఇబ్బంది పెట్టే రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకుంటున్నామని, నిన్ననే జిల్లాకు చెందిన రైస్ మిల్లును సీజ్ చేయడం జరిగిందన్నారు. రైతుకు నష్టం కలిగించిన రైస్ మిల్లును సీజ్ చేసిన కలెక్టర్ ను జిల్లా అధికారులను మంత్రి అభినందించారు. కడ్తా విషయంలో ప్రతి మూడు రైస్ మిల్లులకు ఒక ఏఈవో ఉంటారని పీఏసీ చైర్మన్లు వారి దృష్టికి తీసుకెళ్తే 12 గంటల లోపు రైస్ మిల్లుకు చేరిన ధాన్యంలో కడ్తాను గుర్తిస్తారన్నారు.దాని ప్రకారం రైస్ మిల్లర్లు నడుచుకోవలన్నారు. లేకుంటే మండల నోడల్ కమిటీకి ఫిర్యాదు చేలని వారు సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు. రైతుల ప్రజాప్రతినిధులం కాబట్టి రైతుకు జవాబుదారీగా వ్యవహరించాలని ఆయన చెప్పారు. ఎవరైనా అసత్యపు,అబద్దాలు చెపితే పీఏసీ చైర్మన్ లు క్షేత్రస్థాయిలో రైతులకు అర్ధమయ్యే రీతిలో చెప్పాలని సూచించారు.

 

Related Posts