YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నల్లారిపై సోషల్ మీడియాలో విమర్శలు

నల్లారిపై సోషల్ మీడియాలో విమర్శలు

నల్లారిపై సోషల్ మీడియాలో విమర్శలు
తిరుపతి, ఏప్రిల్ 30
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రి. దాదాపు మూడేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిక్ష అయినా ఆయన తర్వాత ఆ పార్టీని వీడి సొంత పార్టీని పెట్టుకున్నారు. తిరిగి కొంతకాలం క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ సమన్వయ కమిటీలో సభ్యుడిగా నియమించింది. అయితే కరోనా సమయంలోనూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జాడ లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మూడేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలోకి ఎక్కారు. రాజకీయాల నుంచి తప్పుకుంటే ఆయను ఎవరూ ప్రశ్నించరు. ఆయన ఇంకా రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే గత ఎన్నికల సమయంలోనూ ఆయన పెద్దగా రాజకీయాలను పట్టించుకోలేదు.కానీ మూడేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నేత క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం లేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ, కనీసం ఏపీ ప్రజలకయినా అండగా నిలిచే, భరోసా నింపే ప్రయత్నం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేయకపోవడ విచారకరం. కష్ట సమయంలో అండగా ఉండకుండా ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వస్తే వారు ఈయన చెప్పే హితోక్తులు వింటారా? అన్నది సందేహమే.నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా బాధ్యత ఉంది. ఆయన ఇప్పుడు రాజకీయంగా క్రియాశీలకంగా లేకపోవచ్చు. కనీసం కరోనా సమయంలోనైనా ప్రజలకు భరోసా నింపడంతో పాటు ప్రభుత్వానికి సూచనలు అందించాలి. మీడియా ముందుకు వచ్చి ప్రజలకు లాక్ డౌన్ వంటి విషయాల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి. కానీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం బాధ్యత లేకండా వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు విన్పిస్తున్నాయి. నల్లారి కుటుంబం రాజకీయంగా సంపాదించుకున్నా కరోనా సయమంలో సాయం అందించకపోవడంపైనా ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరం కావాలని అనుకోబట్టే కరోనా సమయంలో కామ్ గా ఉన్నారన్న వ్యాఖ్యలూ విన్పిస్తున్నాయి.

Related Posts