YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఇండోనేషియాలో ఫాంటమ్ దెయ్యం

ఇండోనేషియాలో ఫాంటమ్ దెయ్యం
 

ఇండోనేషియాలో ఫాంటమ్ దెయ్యం
జకార్తా, ఏప్రిల్ 30
ఫాంటమ్ గుబురు గడ్డం, వికృతమైన ముఖం, భుజాల కిందకి వేలాడే జుట్టు.. పైనుండి కింద దాకా ఒకటే తెల్ల బట్టలు.. చూడగానే వణుకు పుట్టిస్తది ఆ రూపం. ఆ రూపానికి ఉన్న పేరు ఫాంటమ్. మలేసియా జానపద కథల్లో ఫాంటమ్ ఒక దెయ్యం. అలాంటి ఒక దెయ్యం ఇప్పుడు కెమమన్ గ్రామంలో గస్తీ కాస్తోంది. ప్రస్తుతం మలేషియా లో మూమెంట్ కంట్రోల్ ఆర్డర్ అమలులో ఉంది. ఇది లాక్ డౌన్ లాంటిదే. కానీ జనాలు.. ముఖ్యంగా యువత ఆ ఆర్డర్ ను లెక్క చేయట్లేదు. ఇష్టం ఉన్నట్లు తిరుగుతున్నారు. ఇది చూసిన ముహమ్మద్ ఉరబిల్ ఎలియాస్ కి ఒక ఆలోచన వచ్చింది. చిన్నపుడు అతని బామ్మ ఫాంటమ్ దెయ్యం కథలు చెప్పేదట. ఆ ఇ న్స్ పిరేషన్ తో ఫాంటమ్ గెటప్ వేసుకుని వీధుల వెంట తిరుగుతూ జనాలని భయపెడుతూ పాపులర్ అయ్యాడు.మంచిగ చెప్తే విననప్పుడు దండించడమే సరైన మార్గం .. మన దగ్గ ర అమలు చేస్తున్న సూత్రం ఇదే. అయినా కూడా అనవసరమైన కారణాలతో బయటికి వస్తున్నారు. కరోనా ఆర్ ట్ హెల్మెట్లు, యమ ధర్మరాజు గెటప్, నాటకాలు, పాటలు, పద్యాలు, దండోరా, ఆఖరికి విన్నపాలను కూడా లెక్క చేయట్లేదు. పైగా వాటిని చూసేందుకు జనం గుమిగూడుతూ లాక్ డౌన్ బ్రేక్ చేస్తున్నారు. ఎన్ని చేసినా వర్కవుట్ కావట్లేదు. అయితే ఆ రెండు ఊళలో మాత్ ్ల రం దెయ్యానికి భయపడి జనాలు గడప దాటట్లేదు. జంపింగ్ దెయ్యం ఇండోనేసియాలోని జావా ద్వీప ప్రాంతంలోని కేపూ గ్రామం. దెయ్యాలు తిరుగుతున్నాయనే ప్రచారం అక్కడి జనాల్లో వణుకు పుట్టిస్తోంది. సాయంత్రమైతే చాలు అక్కడి రోడ్లు ఖాళీగా మారుతున్నాయి. ఒకవేళ ఉత్తదే అని కొట్టిపడేసి బయటికి వస్తే దెయ్యాలు చుక్కలు చూపిస్తున్నాయి. అనుమానాస్పదంగా రాత్రిళ్లు బయట తిరుగుతున్న వాళ పైకి దూకి బెంబేలెత్తిస్తున్నాయి. నిజానికి దెయ్యాల వేషంలో సంచరిస్తున్న వాళ్లు కేపూ గ్రామస్తులే. గ్రామపెద్దలు కొందరు యువకులకు తెల్ల టి దుస్తులు తొడిగి వారిని పలు ప్రాంతాల్లో మోహరి స్తున్నారు. దెయ్యాలంటే ఆ ఊళ్లోవాళకి ్ల భయం. ఆపైన మూఢనమ్మకాలూ ఎక్కువ. దీంతో గ్రామపెద్దలు గ్రామస్థుల భయాన్ని కరోనా కట్టడి కి ఉపయోగిస్తున్నారు. పోలీసుల సాయంతో దెయ్యాల ప్లాన్‌కి తెర తీయడం విశేషం. ఆ దెయ్యాలకు పొకోంగ్ అనే పేరుంది.సహజంగానే ఇండోనేసియా ప్రజలకు పోకోంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటే విపరీతమైన భయం. అందుకే వాటితోనే పెట్రోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తోంది పోలీస్ శాఖ. ఆ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. అరెస్ట్ చేస్తారు అనుకున్నా.. మలేషియాకు చెందిన ఉరబిల్ ఫాంటమ్ గెటప్ లో తిరుగుతూ పిల్ల లని, పెద్ద లని భయపెట్టిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. దీంతో ఫాంటమ్ దెయ్యం తిరుగుతోందని జనాలు బెంబేలెత్తి పోయారు. అయితే అవి చూసి పోలీస్ లు కూడా అతని ఇంటికి వచ్చారట. “ అరెస్ట్ చేస్తారు ఏమో అని భయపడ్డ. కానీ అభినందించి ఫోటోలు దిగారు. మరి కొంత మంది యువకుల్ని తెచ్చి, వాళ్ళకి కూడా అలాంటి గెటప్ వేయమని అడిగారు. చాలామంది రాత్రి పూట ప్రయాణాలు చేస్తున్నారు. దానికి చెక్ పెట్టేందుకే ఈ ప్లాన్ అమలు చేశారు పోలీసులు. ఇపుడు దేశంలోని కొన్ని ఊళ్లల్లో ఫాంటమ్ దెయ్యాలు పెట్రోలింగ్ చేస్తున్నాయి. ఈ దెయ్యం రూపం కంటే.. వాటి వెనుక కథలు చాలా భయంకరంగా ఉంటాయి. అందుకే కరోనా కంటేడేంజర్ అనే భయంతో బయట తిరిగే వాళ్లు తగ్గిపోగ్గి యార”ని అంటున్నాడు ఉరబిల్. ఇంకో విశేషం ఏంటంటే.. ఫాంటమ్ మీద మలై భాషలో డజన్ పైగా సినిమాలు వచ్చాయి.

Related Posts