బాలీవుడ్ ప్రముఖ నటుడు రిషికపూర్ ఇకలేరు
ప్రముఖ హిందీ నటుడు రిషికపూర్ (67) అనారోగ్యం పాలవడంతో ఆయన్ని బుధవారం రాత్రి ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజులుగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. రిషి కపూర్‌కు 2018లో క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఓ సంవత్సరానికి పాటు చికిత్స తీసుకున్నారు అంతేకాకుండా శ్వాస సంబంద సమస్య ఉండటంతో చికిత్స తీసుకుంటున్నారు. కాగా సడెన్‌గా నిన్న అనారోగ్యానికి గురవడంతో ఆయన్ను ముంబైలోని సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. అయితే ఆయన ఆరోగ్యం విషమించడంతో రిషి కపూర్ ఈ ఉదయం మరణించారు..బాల నటుడిగా శ్రీ 420, మేరా నామ్ జోకర్ లో నటించారు 1973 లో బాబీ సినిమాతో హీరోగా అరంగ్రేట్రం చేసారు బాబీ సినిమా సూపర్ హిట్ తో పెద్ద హీరోగా ఎన్నో హిట్ సినిమాల్లో కొనసాగారు. సినిమాల విషయానికి వస్తే ఆయన ఇటీవల ముల్క్ అనే సినిమాలో నటించి మరోసారి అదరగొట్టారు. ఆయన తాజాగా ది బాడీ అనే సినిమాలో నటించారు. అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా కనిపించారు. రిషి కపూర్.. ప్రముఖ హిందీ యువ హీరో రణ్ బీర్ కపూర్‌కు తండ్రి అని తెలిసిందే.