YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

యూపీలో కరోనా సెగ

యూపీలో కరోనా సెగ

యూపీలో కరోనా సెగ
 లక్నో, ఏప్రిల్ 30
కరోనా సెగ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి తాకింది. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ నిత్యం కరోనాపై సమీక్షలు చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నా ఫలితాలు కన్పించడం లేదు. అనేక చోట్ల లాక్ డౌన్ నిబంధనలను ప్రజలు ఉల్లంఘిస్తున్నట్లు యోగి ఆదిత్యానాధ్ గుర్తించారు. దీంతో మరింత కఠినంగా నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించారు. జూన్ 30వ తేదీ వరకూ ఉత్తర్ ప్రదేశ్ లో ఆంక్షలను విధించాలని యోగి ఆదిత్యనాధ్ నిర్ణయించారు.ఉత్తర్ ప్రదేశ్ లో తొలినాళ్లలో కరోనా కొంత కట్డడిలోనే ఉంది. పెద్ద రాష్ట్రం కావడతో కరోనాను కంట్రోల్ చేయడం కష్టమని భావించి అన్ని చర్యలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో వలస కార్మికులు కూడా ఎక్కువే. గ్రామీణ ప్రాంతాలు అధికమే. దీంతో యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం తొలి నుంచి కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేసింది. రాష్ట్రాల సరిహద్దులు మూసివేసింది.యోగి ఆదిత్యానాధ్ తన తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరుకాలేకపోయారు. అయితే గత పదిహేను రోజుల నుంచి ఉత్తర్ ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం 75 జిల్లాలున్నాయి. ఇందులో 56 జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. దీంతో కంటెయిన్ మెంట్ ప్రాంతాల్లో మరిన్ని పరీక్షలు నిర్వహించాలని యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వం నిర్ణయించింది.దీంతోపాటు మే 3వ తేదీ నుంచి లాక్ డౌన్ కొనసాగించినా, ముగిసినా ఆంక్షలను ఉత్తర్ ప్రదేశ్ లో కొనసాగించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ నిర్ణయించారు. జూన్ 30వ తేదీ వరకూ ఉత్తర్ ప్రదేశ్ లో ఎవరూ గుమికూడ కూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించింది. అంటే ఉత్తర్ ప్రదేశ్ లో మరో నెల రోజుల పాటు నిబంధనలను కఠినతరంగా ఉంటాయని యోగి ఆదిత్యానాధ్ ప్రకటించారు. మహారాష్ట్ర తరహా వైరస్ వ్యాప్తి చెందకూడదని యోగి ఆదిత్యానాధ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
 

Related Posts