YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

జగన్ ను ఆడేసుకుంటున్న సోషల్ మీడియా

జగన్ ను ఆడేసుకుంటున్న సోషల్ మీడియా

జగన్ ను ఆడేసుకుంటున్న సోషల్ మీడియా
విజయవాడ, ఏప్రిల్ 30
ఈ వైరస్ జస్ట్ జ్వరం లాంటిదే. కొందరికి వచ్చినట్లు పోయినట్లు కూడా తెలియదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ దరిచేరకుండా చూసుకోవొచ్చు. ఇది ఎవరికైనా రావొచ్చు నాకు మీకు కూడా. అయితే ఇలా వ్యాధి సోకిన వారిని వేరుగా చూడొద్దు. వైరస్ కి మందు లేదు కనుక అది వచ్చేవరకు దీనితో సహజీవనం చేయాలిసిందే. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు ఇచ్చిన సందేశం. అయితే విపక్షాలు ఆయన వ్యవహారశైలిపై దుమ్మెత్తిపోస్తున్నాయి.కానీ ఇదే సందేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పింది. డబ్ల్యు హెచ్ ఓ చెబితే ఒకే కానీ జగన్ అంటే మాత్రం నాట్ ఒకేనా అంటూ ఇప్పుడు సిఎం జగన్ కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. దీనిపై అటు టిడిపి, వైసిపి వర్గాలు ఒక రేంజ్ లో ట్రోల్ చేసుకోవడం ట్రెండింగ్ గా మారింది. వాస్తవానికి ప్రస్తుతం ప్రజలు ఇలాంటి నిర్బంధాలు అలవాటు లేక, చేతికి పనిలేక, జేబులో సొమ్ములు లేక అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీడియా లో వస్తున్న వార్తలు, ఛానెల్స్ లో ప్రసారం అవుతున్న వార్తలు తీవ్ర భయోత్పాతానికి గురిచేస్తున్నాయి. వీటి ప్రభావంతో ప్రజలు హడలిపోతున్నారు.ఒక వేళ ప్రభుత్వం లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసినా ప్రజలు భయం భయంగానే తమ పనులు చేస్తారో లేదో తెలియడం లేదు. లాక్ డౌన్ తలనొప్పి నుంచి వారిని నెమ్మది నెమ్మదిగా బయటకు తీసుకురావాలి అంటే పాలకులు ధైర్యం నింపాలి. అలా చేసేందుకే జగన్ ఈ మహమ్మారి ని తేలిక చేసే క్రమం లో భాగంగానే తన కామెంట్స్ ఉంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. భయం వైరస్ కన్నా ప్రమాదం కనుక సామాజిక దూరం పాటించడం, మాస్క్ లు ధరించడం, చేతుల పరిశుభ్రత వంటివి పాటిస్తూ ఆర్ధిక స్థితిగతులను మెరుగు పరుచుకోక తప్పని పరిస్థితి అటు సామాన్యులనుంచి ప్రభుత్వం వరకు ఉంది.ఆ దిశగానే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ వైరస్ టెస్ట్ లు నిర్వహిస్తూ దానిపై యుద్ధం చేస్తూనే సాధారణ పరిస్థితుల్లోకి అందరిని తీసుకువచ్చే ప్రయత్నాలను జగన్ సర్కార్ గట్టిగానే మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. అయితే రాజకీయాలు అలవాటు అయిపోయిన విపక్షాలు ముఖ్యమంత్రి జగన్ ప్రతి వ్యాఖ్యను తప్పుగా రంధ్రాన్వేషణ ఈ సమయంలో చేయడం దారుణమని అధికారపార్టీ వర్గాలు ఎదురు దాడి మొదలు పెట్టడంతో ఈ వ్యవహారం మొత్తం పొలిటికల్ ఎపిసోడ్ అయిపోవడం దురదృష్టకరమే.
 

Related Posts