YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భారీ రిలాక్సేషన్ దిశగా కేంద్రం

భారీ రిలాక్సేషన్ దిశగా కేంద్రం

భారీ రిలాక్సేషన్ దిశగా కేంద్రం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30
దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్ మే 3న ముగియనున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన చేసింది. మే 4 నుంచి చాలా జిల్లాలకు లాక్‌డౌన్ నిబంధనల నుంచి గణనీయమైన రీతిలో వెసులుబాటు కల్పించనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే వెలువరించనున్నారు. లాక్‌డౌన్ పరిస్థితిపై హోం శాఖ  రివ్యూ మీటింగ్ నిర్వహించింది. లాక్‌డౌన్ కారణంగా పరిస్థితి ఎంతో మెరుగైందని తెలిపింది. మే 3 వరకు లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.దేశాన్ని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు విభజించి.. రెడ్ జోన్లలో లాక్‌డౌన్ పొడిగిస్తారని.. గ్రీన్ జోన్లలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆరెంజ్ జోన్లను గ్రీన్ జోన్లు మార్చేలా కార్యచరణ రూపొందించారు.ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికులు తిరిగి సొంత రాష్ట్రాలకు చేరుకోవడానికి కేంద్రం  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు ఊరట లభించనుంది.గ్రీన్ జోన్‌లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో సోషల్ డిస్టెన్సింగ్, ఇతర జాగ్రత్తలు పాటిస్తూ ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేలా కేంద్రం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ కార్యకలాపాలతోపాటు కొన్ని ఇతర రంగాలకు కూడా కేంద్రం లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. కానీ మార్కెట్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు మూసి ఉంటాయని కేంద్రం తెలిపింది,కరోనా వైరస్ కట్టడి కోసం మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తర్వాత మెజార్టీ రాష్ట్రాల సూచనల మేరకు లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఏప్రిల్ 20 తర్వాత గ్రీన్ జోన్లలో కొద్ది పాటి సడలింపులు ఇచ్చారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ.. లాక్‌డౌన్ నిబంధనలను కొద్ది కొద్దిగా సడలిస్తున్నారు. మే 3 తర్వాత లాక్‌డౌన్ పొడిగించాలని మేఘాలయా, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి.
 

Related Posts