ఆన్ లైన్ క్లాసుల కష్టాలు
విజయవాడ, ఏప్రిల్ 30
కరోనా దెబ్బకు ఒక్కసారిగా మానవ జీవన విధానమే మారిపోయింది . ఇక కేంద్రప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ తో జనజీవనం ఎక్కడిది అక్కడే నిలిచిపోయింది . ఇక ప్రధానంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. పరీక్షల సమయంలో విద్యార్థులు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది . దీంతో ఈ సమయంలో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు కొన్ని విద్యాసంస్థలతో పాటు కొందరు తల్లిదండ్రులు ఆన్‌లైన్ క్లాసులపై శ్రద్ద చూపిస్తున్నారు. విద్యార్థుల సమయం వృధా కాకుండా ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని తరగతులు నిర్వహించాలని భావిస్తున్న విద్యా సంస్థలు అందుకు శ్రీకారం చుట్టాయి. కానీ ఆన్ లైన్ లో క్లాసులు చెప్పటం టీచర్లకు తలనొప్పిగా మారింది. కరోనా మహమ్మారి మానవ హక్కుల సంక్షోభంగా మారవచ్చు : ఐక్యరాజ్య సమితి హెచ్చరిక 14 ఏళ్ల బాలుడితో ముగ్గురు పిల్లల తల్లి రొమాన్స్, రాత్రి ఆ పని కోసం… కరోనా అందుకే అదుపులోకి రావడం లేదు, ఆలోపు సమసిపోతుంది:… ఆన్ లైన్ క్లాసులు చెప్తున్న టీచర్లు .. సతాయిస్తున్న విద్యార్థులు తరగతి గదిలోనే టీచర్ కంట్రోల్ చేస్తుంటే కంట్రోల్ కాని పిల్లలు ఇళ్ళలో ఆన్ లైన్ లో శ్రద్ధగా పాఠం వింటారా ?పాఠాలు వినకుండా అల్లరి చెయ్యటం , ఇష్టం వచ్చినట్టు అరవటం ,ఫన్నీ జోక్స్ , వీడియోస్ ప్లే చెయ్యటం , పాఠం చెప్పే మాస్టార్ కు ఇబ్బంది కలిగించటం వంటి చర్యలతో టీచర్లు ఆన్ లైన్ క్లాసులు చెప్పటం మావల్ల కాదు మహా ప్రభో అన్న స్థాయికి తీసుకు వస్తున్నారు విద్యార్థులు . ఇప్పటికే చాలా ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ యూనివర్సిటీలు డిజిటల్ బోధనకు తెరతీశాయి. ఇక చాలా స్కూల్స్ సైతం ఆన్ లైన్ క్లాస్ లకు ఆసక్తి చూపిస్తున్నాయి. జూమ్ యాప్ ద్వారా ఆన్ లైన్ తరగతులు .. ఆడుకుంటున్న విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ విద్యార్థుల వరకు ఆన్‌లైన్ అసైన్‌మెంట్లు, రికార్స్ ఇచ్చి విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం లాక్ డౌన్ సమయంలో ఆటలకు ఇచ్చిన ప్రాధాన్యత దేనికీ ఇవ్వటం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ అదే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే యూనివర్సిటీలు, వాటికి అనుబంధ కళాశాలలు, ప్రైవేట్ పాఠశాలలతో పాటు ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ విద్యాబోధన చేసే యాజమాన్యాలు అన్నీ ఆన్‌లైన్ పాఠాలు బోధిస్తున్నాయి . జూమ్ యాప్ ద్వారా ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఆన్ లైన్ క్లాసులలో ఒకటే అల్లరి..భరించలేక సెషన్ క్లోజ్ చేస్తున్న టీచర్లు విద్యార్థులు ఇష్టం వచ్చిన పేర్లతో లాగిన్ అయ్యి టీచర్ క్లాస్ చెప్తుంటే మధ్యలో ఇబ్బంది కలిగిస్తున్నారు . ఎవరు లాగిన్ అవుతున్నారో అర్ధం కాకుండా రకరకాల పేర్లు పెట్టుకుని క్లాసులకు లాగిన్ అవుతున్నారు. ఇక ఇబ్బంది కలిగించే స్టూడెంట్ ను క్లాస్ నుండి బయటకు పంపినా ఇంకో కొత్త పేరు క్రియేట్ చేసుకుని మళ్ళీ అలాగే క్లాస్ లో ప్రవర్తిస్తున్నారు . లాక్ డౌన్ ఎప్పటికి ముగుస్తుందో అర్ధం కాని తరుణంలో విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఆన్‌లైన్ బోధన ద్వారా విద్యాబోధన చెయ్యాలని ప్రయత్నిస్తుంటే అది అర్ధం చేసుకోకుండా అరవటం , సెటైర్లు వెయ్యటం , జోక్స్ ప్లే చెయ్యటం , పాటలు పెట్టటం , మిగతా వారికి ఇబ్బంది కలిగించటం వంటి చర్యలతో, విచిత్రమైన చేష్టలతో టీచర్లు విసిగిపోతున్నారు. కొన్ని సార్లు మధ్యలోనే క్లాస్ క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు.