YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

పంటల భీమాతో ఇక ధీమా

పంటల భీమాతో ఇక ధీమా

పంటల భీమాతో ఇక ధీమా
హైద్రాబాద్, ఏప్రిల్ 30
ఖరీఫ్‌ పంటల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందస్తుగా బీమాను అమలు చేస్తూ రైతులకు గడువును విధించింది. అతివృష్టి, అనావృష్టి నెలకొన్నప్పుడు ఈ బీమా కొండంత అండగా నిలవనుంది. ఖరీఫ్‌, రబీలో పంటలకు బీమా చేసుకుంటే రైతులు ఇక నిశ్చింతగా ఉండొచ్చు. హెక్టారుకు రూ.20వేలకు పైగా పరిహారం పొందే వీలుంది. ప్రధానమంత్రి పంటల బీమా చేయడంతో రైతులకు నష్టపరిహారం అందుతుంది. విత్తనాలు నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు కలిగే నష్టాలు బీమా కిందకు రానున్నాయి. ప్రీమియం కట్టిన రైతు అతని కుటుంబసభ్యులు మరణించినా, శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ.2లక్షల వరకు పరిహారం చెల్లిస్తారు. ప్రధానమంత్రి పంటల బీమా పథకంలో వరిని గ్రామం యూనిట్‌గా, ఇతర పంటలను మండలం యూనిట్‌గా పరిగణించనున్నారు. ఆయా పంటలకు బీమా చేసేందుకు ప్రభుత్వం గడువును విధించింది. ఈ క్రమంలో ఇప్పటినుంచే రైతులను అప్రమత్తం చేస్తేనే ఆశించిన ప్రయోజనం చేకూరనుంది. పత్తి పంటకు జులై 15 గడువు కాగా మిరప పంటకు జులై 7 లోపు బీమా చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. వరి పంటకు ఆగష్టు 31, అలాగే మొక్కజొన్న,  జొన్న, కంది, పెసర, వేరుశనగ, పసుపు పంటలకు జులై 30 వరకు గడువు.మామిడి పంటకు వాతావరణ ఆధారిత బీమా చేయాలని, మిగిలిన పంటలకు గ్రామం, మండల యూనిట్‌గా బీమా వర్తిస్తుందని ప్రకటించింది. ఆయా పంటలకు గడువును నిర్దేశించగా ఖరీఫ్‌ పంటలకు మాత్రమే వర్తించనుంది. గత యాసంగి సీజన్‌ నుంచి ప్రధానమంత్రి పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. పంట నష్టపోతే ప్రభుత్వం పరిహారం ఖరారు చేసేది.. అధికారుల నివేదిక ప్రకారం నష్టం అంచనా వేసేది. ఇకపై అలాంటి విధానం లేకుండా కేవలం బీమా చేసుకున్నవారికే పరిహారం వరిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీమా ప్రారంభంలో మొక్కుబడిగా ప్రచారం చేయడంతో ఆశించిన స్థాయిలో రైతులు బీమా చేసుకోలేదు. జిల్లాలో 276 గ్రామ పంచాయతీలుండగా 210 రెవెన్యూ గ్రామాలున్నాయి. జిల్లా పరిధిలో నాలుగు వ్యవసాయ డివిజన్లు కరీంనగర్‌, మానకొండూరు, చొప్పదండి, హుజూరాబాద్‌ డివిజన్లలో కార్యక్రమాలను చేపట్టేందుకు గతంలో కరపత్రాలను ముద్రించారు. ఈసారి 1.32లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా పత్తి 62వేల హెక్టార్లు, వరి 50వేల హెక్టార్లు, మొక్కజొన్న 18వేల హెక్టార్లు, కందులు 2వేల హెక్టార్లు సాగవనుంది: బ్యాంకుల నుంచి రుణం తీసుకునే ప్రతి రైతు ఈ పథకంలో చేరాల్సి ఉంటుంది. రైతులు సాగు చేసే పంటలకు సంబంధించిన ప్రీమియాన్ని రుణంలోనే మినహాయించి కంపెనీకి చెల్లించి బీమా ఇస్తారు. ఇది తప్పనిసరిగా ఉంటుంది. బ్యాంకుల నుంచి రుణం తీసుకోని రైతులు ఇష్టం ఉన్న పంటకు బీమా చేసుకోవచ్చు. సమీపంలోని డీసీసీబీ, గ్రామీణ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల్లో వేటిలోనైనా దరఖాస్తు పూర్తిచేసి ప్రీమియం చెల్లించవచ్చు. కౌలు రైతులకు కూడా అవకాశం కల్పించారు.

Related Posts