YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

యదేఛ్చగా చెట్లు నరికేస్తున్నారు.

యదేఛ్చగా చెట్లు నరికేస్తున్నారు.

యదేఛ్చగా చెట్లు నరికేస్తున్నారు.
పాలమూరు, ఏప్రిల్ 30
హరితహారం బుగ్గిపాలవుతోంది. చెట్లను కాపాడాల్సిన అధికారులే బాహాటంగా చెట్లను నరికి బొగ్గును అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులకు కొమ్ము కాస్తున్నారు. నామమాత్రపు కేసులు పెడుతూ, తిరిగి వ్యాపారం కొనసాగించేందుకు ఊతమిస్తున్నారు. ఒక్క డిసిఎం లోడుకు రూ.2లక్షలు రేటు పలుకుతుందని అంచనా. నాలుగు చెట్లను ప్రభుత్వ అనుమతితో కొనడం వాటిని కొట్టడం, వాటితోపాటు మరో పదుల సంఖ్యలో ప్రభుత్వ స్థలంలో కానీ, చెరువుల ప్రాంతంలో కానీ అక్రమంగా చెట్లు నరకడం, వాటిని అనుమతి ఉన్న చెట్లతో కలిపి బొగ్గు కాల్చడం వాటిని రవాణా చేయడం ఇక్కడ జరుగుతున్న చీకటి వ్యాపారం. 15రోజుల్లో సుమారు రెండు లోడ్‌ల వ్యాపారం జరుగుతున్నట్లు స్థానికులు చెపుతున్నారు. కురవి మండలం మొదుగులగూడెం అడ్డాగా లక్షలాది రూపాయల అక్రమ బొగ్గు వ్యాపారం ఎటువంటి అనుమతులు లేకుండా రవాణా జరుగుతోంది. చెట్లను నరకడం, వాటిని బట్టిలో బొగ్గుగా మార్చడం, లారీలు, ఆటోల్లో బస్తాలతో తరలించి వ్యాపారం చేయడం ఇక్కడ మామూలైపోయింది. అధికారుల అండదండలతోనే ఈ వ్యాపారం యదేచ్ఛగా కొనసాగుతోందనే స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు సంబంధిత ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఈ బొగ్గువ్యాపారం కొనసాగుతూనే ఉంది. దీనిని అరికట్టడంలో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో వివిధ పత్రికల్లో కథనాలు వచ్చినా అధికారుల్లో కదలిక లేకపోవడం విచారకరం. మోదుగులగూడెం అడ్డాగా తిరిగి వ్యాపారం యథావిధిగా కొనసాగుతూ బొగ్గుకుప్పలు పోసి ఉన్నాయి. అసలు బొగ్గు వ్యాపారానికి అనుమతి ఉందా. అనుమతి లేకుంటే అక్కడ ఉన్న ఆనమాలు కానీ, వ్యాపారం కొనసాగిస్తున్నప్పుడు కానీ, చెట్లను కాలుస్తున్నప్పుడు కానీ అధికారులు నేరుగా దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయా అంటే అవేమీ లేవు. అంతా అమ్ముడు పోయిన తర్వాత దొంగలు పడ్డ ఆరునెలలకు… అన్న చందంగా దాడులు చేస్తున్నారు. ఇది ఇప్పటి తాజా వ్యాపారం కాదు. గత కొద్ది నెలలుగా నడుస్తున్న వ్యాపారం. అయినా ఎందుకు దీన్ని పట్టింకుకోవడం లేదు. ఈ వ్యాపారం వెనుక ఎవరి హస్తం ఉంది. ఎంత మంది ఉన్నారు. ఎక్కడికి బొగ్గును తరలిస్తున్నారని సంబంధిత అధికారులు ఆరా తీసిన పాపాన పోలేదు. అంటే అధికారుల అండదండలు బొగ్గు దందా వ్యాపారులకు పూర్తిగా ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి. కటింగ్ మిషన్లు, జనరేటర్ ఇక్కడ చెట్లను నరికేందుకు, బొగ్గును కాల్చేందుకు వినియోగిస్తున్నారు. చింత చెట్లు, గుబ్బచెట్లు, సర్కార్ తుమ్మ, తుమ్మ చెట్లు ఈ ప్రాంతంలో ఎక్కువగా నరుకుతున్నారు. చెట్లను నరకడం వాటిని బట్టికి తరలించడం, బొగ్గుగా మార్చడం, వాటిని వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ ప్రాంతాలకు తరలించడం ఇక్కడ నిత్యం జరుగుతున్న అక్రమ బొగ్గు వ్యాపారం.

Related Posts