YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

పర్యావరణాన్ని కాపాడండి, వన్యప్రాణులను రక్షించండి బైక్ పై ఒక్క యువకుడి వేల కిలో మీటర్ల సాహస యాత్ర

పర్యావరణాన్ని కాపాడండి, వన్యప్రాణులను రక్షించండి బైక్ పై ఒక్క యువకుడి వేల కిలో మీటర్ల సాహస యాత్ర

ఒక్క యువకుడు..  బైక్ పై వేల కిలో మీటర్ల సాహస యాత్ర.. దేశమంతా, అన్ని రాష్ట్రాలూ తిరుగుతున్నాడు. ఒక్కటే లక్ష్యం.. పర్యావరణాన్ని కాపాడండి, వన్యప్రాణులను రక్షించండి. మానవ మనుగడకు పాటుపడండి అంటూ అందరికీ విజ్ఞప్తి  చేస్తున్నాడు. అతడే అస్సాంకు చెందిన జులియన్ బోరా.  గత నెలలో అస్సాంలో మొదలు పెట్టిన ఇతడి దేశ వ్యాప్త బైక్ యాత్ర పశ్చిమ బెంగాల్, జార్ఝండ్, ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్ ల మీదుగా  తెలంగాణకు చేరుకుంది. ఇప్పటికే నాలుగు వేల కిలోమీటర్ల యాత్ర పూర్తి చేశానని, రానున్న రెండు నెలల్లో మిగతా అన్ని రాష్ట్రాలూ బైక్ పైనే తిరుగుతూ పర్యావరణ, వన్యప్రాణుల రక్షణ ఆవశ్యకతపై  అవగాహన కల్పిస్తానని చెబుతున్నాడు. ప్రకృతిని, జంతువులను కాపాడుకోకపోతే మానవ మనుగడకే ప్రమాదమని, ఆ సృహను అందరిలో కల్పించటమే కోసమే తాను ఒంటరిగా దేశయాత్ర చేస్తున్నానని జులియన్ చెబుతున్నాడు. యాత్రలో భాగంగా హైదరాబాద్ వచ్చిన అతను అరణ్య భవన్ లో అటవీ శాఖ ఉన్నతాధికారులను కలుసుకున్నాడు. సమాజహితం కోసం ఒంటరిగా యాత్ర చేస్తున్న జులియన్ ను అటవీ శాఖ ఉన్నతాధికారులు అభినందించారు. అతడి యాత్ర దేశ వ్యాప్తంగా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.  సేవ్ రైనో , సేవ్ వైల్డ్ లైఫ్ అనేది తన యాత్ర నినాదం అంటున్నాడు జులియన్.  భారతదేశానికే ప్రత్యేకమైన ఖడ్గమృగం భవిష్యత్తు ప్రస్తుతం ప్రమాదంలో పడిందని, తక్షణం మేల్కొని రక్షించుకోకపోతే ఇటవలే ఆఫ్రికాలో చిట్ట చివరి ఖడ్గమృగం చనిపోయిందని, అదే పరిస్థితి భారత్ లోనూ వస్తుందన్నారు. ఖడ్గమృగాల వేట, కొమ్ముల అమ్మకం ఈశాన్య రాష్ట్రాల్లో దారుణంగా ఉందని, బంగ్లాదేశ్, నేపాల్ ల మీదుగా స్మగ్లింగ్ అవుతున్న ఖడ్గమృగాలకు ఐదు కోట్ల దాకా పలుకుతోందని జులియన్ వెల్లడించారు. అందరి సహకారంతోనే వన్యప్రాణుల వేటను నిరోధించగలమనే ఉద్దేశ్యంతోనే తాను బైక్ రైడ్ ను ఎంచుకున్నట్లు వెల్లడించాడు.   రోడ్ థ్రిల్స్ అనే సంస్థ ప్రతినిధులు హైదరాబాద్ లో జులియన్ కు తోడయ్యారు. అడవులు, జంతువుల రక్షణ కోసం తాము జులియన్ కు మద్దతు ప్రకటించామని, ఆయనతో పాటు వీలున్నప్పుడల్లా దేశ యాత్రలో బైక్ రైడ్ లో పాల్గొంటామని రోడ్ థ్రిల్స్ ప్రతినిధులు పార్థసారథి, అభిషేక్ లు వెల్లడించారు.  తెలంగాణలోనూ వన్యమృగాల వేట, అటవీ విధ్యంసం సమస్యలున్న విషయాన్ని ప్రస్తావించిన అధికారులు,  వీటిని అడ్డుకునేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వచ్చంద సంస్థలు, బైక్ రైడింగ్ క్లబ్ ల సహకారం తీసుకుంటామన్నారు. జులియన్ దేశ యాత్ర విజయవంత కావాలని ఆకాంక్షిస్తూ ఆయనను మెమొంటోతో సత్కరించారు తెలంగాణ అటవీ శాఖ ఉన్నతాధికారులు. అంతకు ముందు జులియన్ బోరా నెహ్రూ జూ పార్కును, దూలపల్లి ఫారెస్ట్ అకాడమీని సందర్శించారు. తాను అస్సాంలో బయలు దేరిన తర్వాత తొలిసారి నెహ్రూ జూలో  నాలుగు ఖడ్గమృగాలను చూశానని, వాటిల్లో రెండు ఇక్కడే జూలో పుట్టాయని తెలిసి సంతోషం కలిగిందన్నాడు.

ఈ కార్యక్రమంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీ.కె.ఝా, పీసీసీఎఫ్ లు ప్రధ్వీరాజ్, రఘువీర్ , అదనపు అటవీ సంరక్షణ అధికారులు మునీంద్ర, లోకేష్ జైస్వాల్, స్వర్గం శ్రీనివాస్, శోభ, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎం

Related Posts