YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

ఎ, బి1, బి6, సిలతో పుచ్చకాయ

ఎ, బి1, బి6, సిలతో పుచ్చకాయ

ఎ, బి1, బి6, సిలతో పుచ్చకాయ
వరంగల్, ఏప్రిల్ 30
పుచ్చకాయ వేసవిలో లభించే సీజనల్ ఫ్రూట్. ఇందులో విటమిన్ ఎ, బి1, బి6, సి, పొటాషియం, మెగ్నిషియం, మాంగనీస్, బయోటిన్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. అయితే వేసవి కాలంలో మనకు ఎదురయ్యే అనారోగ్య సమస్యలను అధిగమించాలంటే ఈ సీజన్‌లో పుచ్చకాయను కచ్చితంగా తినాల్సిందే. దీన్ని అలాగే తిన్నా లేదంటే జ్యూస్ రూపంలో తీసుకున్నా అనేక లాభాలు పొందవచ్చు.ఎండాకాలంలో చాలా మంది జీర్ణ సంబంధ సమస్యలను ఎదుర్కొంటారు. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఉన్నవారు పుచ్చకాయను తినాలి. దీంతో ఆయా సమస్యలు తగ్గిపోతాయి. పుచ్చకాయను అలాగే తింటున్నా, లేదంటే దాని జ్యూస్‌ను తాగుతున్నా వెంట్రుకల సమస్యలు తగ్గుతాయి. జుట్టు దృఢంగా పెరగడమే కాదు, ప్రకాశవంతంగా మారుతుంది కూడా. విటమిన్ సి, కెరోటిన్ వంటివి పుచ్చ‌కాయ ద్వారా ల‌భించ‌డం వల్ల జుట్టు సమస్యలు రావు. . వేసవిలో చాలా మంది ఎదుర్కొనే సమస్య డీహైడ్రేష‌న్‌. ఎంత నీటిని తాగుతున్నా వేసవి తాపానికి ఆ నీరు ఇట్టే ఇంకిపోతుంది. దీంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఫలితంగా వడదెబ్బ కూడా తగులుతుంది. అయితే అలా కాకుండా ఉండాలంటే పుచ్చకాయను తినాలి. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చు.  శరీరంలోని వ్యర్థ పదార్థాలను సమర్థవంతంగా బయటికి పంపే ఔషధ గుణాలు పుచ్చకాయలో ఉన్నాయి. పుచ్చకాయను తరచూ తింటుంటే బాడీ మొత్తం క్లీన్ అవుతుంది. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. వేసవి కాలంలో ఎండలో తిరిగే వారి చర్మం నల్లగా అవుతుంది. దీనికి తోడు చర్మంపై దద్దుర్లు, మంట కూడా వస్తాయి. అలాంటప్పుడు పుచ్చకాయ జ్యూస్‌ను తాగితే ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మ సమస్యలను నివారిస్తాయి. పుచ్చకాయల్లో ఉండే ఔషధ గుణాలు బీపీని కంట్రోల్ చేస్తాయి. రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. గుండె సమస్యలు ఉన్న వారికి మంచి ఆహారం. పుచ్చకాయను తరచూ తింటుంటే రక్త సరఫరా మెరుగు పడడమే కాదు, రక్తం కూడా పెరుగుతుంది. విటమిన్ ఎ ఎక్కువగా ఉండడం వల్ల పుచ్చకాయను తింటే కంటి ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. కళ్లకు చాలా మంచిది. వేసవిలో కళ్లకు కలిగే ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి. నాడీ వ్యవస్థను ప్రభావితం చేసి మనస్సుకు రిలాక్సేషన్ ఇచ్చే గుణాలు పుచ్చకాయలో ఉన్నాయి. అందువల్ల పుచ్చకాయను తింటే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. టెన్షన్, ఆందోళన, ఒత్తిడి వంటివి తగ్గుతాయి.

Related Posts