YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

ముంబాయిలో వలస కూలీలను ఆదుకున్న మంత్రి సింగిరెడ్డి

 ముంబాయిలో వలస కూలీలను ఆదుకున్న మంత్రి సింగిరెడ్డి
 
 

 ముంబాయిలో వలస కూలీలను ఆదుకున్న మంత్రి సింగిరెడ్డి
వనపర్తి ఏప్రిల్ 30
ముంబయిలో వలసకూలీలకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  నిత్యావసరాలు అందించారు. ముంబయిలోని ధానే, కిసాన్ నగర్, కల్వ, విఠావా, కారేగావ్, పార్శిక్ నగర్, కల్హేర్, మలాడ, బాల్కూమ్ ప్రాంతాలలో ఉన్న వనపర్తి జిల్లా వలస కూలీలకు పంపిణీ జరిగింది.  ప్రతి కుటుంబానికి 5 కేజీల బియ్యం, 3 కేజీల గోధుమపిండి, టీ పొడి, 200 గ్రా పసుపు, కేజీ కందిపప్పు, కేజీ ఆయిల్ , కేజీ చక్కెర,  కేజీ ఆలుగడ్డ, కేజీ ఉల్లిగడ్డ, 4 సబ్బులలో కూడిన పది వస్తువులు పంపిణీ చేసారు. వలస కూలీలు మాట్లాడుతూ  45 రోజులుగా ఇబ్బందులలో ఉన్నాం.ఆదుకున్నందుకు ధన్యవాదాలన్నారు. మంత్రి మాట్లాడుతూ  ప్రపంచమే ప్రస్తుతం ఇబ్బందులలో ఉంది.  మనిషికి మనిషి తోడుగా నిలవాల్సిన సమయం.  నిత్యావసర సరుకులుంటే కూలీలు నిశ్చింతగా ఉంటారు.  లాక్ డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకుని కలెక్టర్ ద్వారా ముంబయిలో నిత్యావసరాలు అందేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముంబయిలో స్థిరపడిన వనపర్తి వాసులు మూడావత్  గోపాల్ నాయక్, జానూ రాత్లావత్, ఖిల్లా ఘణపూర్ మండలం మామిడిమాడ సర్పంచ్ రాజూనాయక్ లు పాల్గోన్నారు.

Related Posts