ఒక మనసు'తో కథానాయికగా తొలి అడుగు వేసింది మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా.. తమిళంలో ఓ అవకాశం ఆమెని వెదుక్కుంటూ వచ్చింది. ఆ చిత్రమే విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన 'ఒరు నల్ల నాళ్ పాతు సొల్రేన్'. కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ మరొక కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకి ఆర్ముగ కుమార్ దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమాని ఫిబ్రవరి 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో విజయం అందుకోలేకపోయిన నిహారిక.. తమిళంలో అయినా సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి. ఇదిలా ఉంటే.. 'హ్యాపీ వెడ్డింగ్' అనే తెలుగు సినిమాలోనూ నిహారిక హీరోయిన్‌గా నటిస్తోంది. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.