YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఏపీలో అర్ధిక నియంత్రణ లేదు : ఏజీ (అడిట్)

ఏపీలో అర్ధిక నియంత్రణ లేదు : ఏజీ (అడిట్)

2017 మార్చి 31 నాటికి పూర్తి కావాల్సిన 271 ప్రాజెక్టు ల్లో ఏ ఒకటి పూర్తి కాలేదు. అంచనాలు 28 వేల కోట్లకు పెంచేశారు. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయక పోవడం వలనే అంచనా వ్యయం పెరిగిందని ఏపీ ప్రధాన అకౌంటెంట్ జనరల్ (అడిట్) ఎల్ టచ్చవంగ్ అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లడారు. పథకాలు పూర్తి చేయడంలో జాప్యం, చెప్పిన పథకాలు ప్రారంభించక పోవడంతో 2017 మార్చి  నాటికి 110 కోట్లు నిధులు మిగిలిపోయాయి. డిపిఆర్ లు తయారీ ప్రాథమిక పనులు ఆరంభించక పోవడం వలన 455 కోట్లు కేంద్ర సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోలేక పోయిందని వ్యాఖ్యానించారు. పనులు పూర్తి అయినప్పటికీ 7 పథకాలు ను రాష్ట్ర ప్రభుత్వం ఆరంభించలేదు. మరో 7 పథకాలు మధ్యలో ఆగిపోయాయి.. ఫలితంగా 491 కోట్లు వృదాయ్యాయి. హడావుడి ఖర్చులును 27 నుంచి 50 శాతంకు ప్రభుత్వం పెంచిందని అయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యావవస్థ దారుణంగా ఉంది. బోధన విద్య పరమైన పర్యవేక్షణ లేదని అన్నారు. 6 వ తరగతి పిల్లలు లో చాలా మంది చదవ లేక పోతున్నారు, రాయలేక పోతున్నారు. 2017 మార్చి 31 నాటికి 76 వేల రుణ బకాయిలు తీర్చాల్సి ఉంటుంది.. ఈ రుణ భారం ప్రభుత్వ బడ్జెట్ పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని అయన అన్నారు. ఆర్థిక నియమాలు, విధానాలు పాటించక పోవడం ఆర్ధిక నియంత్రణ లేకపోవడం వంటి వాటిని వివిధ సందర్భంల్లో గమనించామని అయన వ్యాఖ్యానించారు

Related Posts