దేశంలో ఉగ్ర దాడులకు తీహార్ జైల్లో భారీ కుట్ర
న్యూఢిల్లీ ఏప్రిల్ 30,
దేశంలో ఉగ్ర దాడులకు తీహార్ జైల్లో భారీ కుట్ర పన్నినట్టు ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. సూత్రదారి హైదరాబాద్కు చెందిన తీవ్రవాది అబ్దుల్ బాసిత్ గా గుర్తించారు. గతంలో ఐసిస్లో చేరేందుకు వెళ్తూ మహారాష్ట్రలో బాసిత్ పట్టబడ్డాడు. ఖైదీగా ఉంటూ ఓ వర్గం యువతకు తీహార్ జైలునుంచే ఉగ్ర పాఠాలు నేర్పిస్తున్నట్టు ఎన్ఐఏ విచారణలో స్పష్టమైంది. తీహార్ జైలు నుంచి ఉగ్రవాదిని ఎన్ఐఏ పది రోజుల పాటు అదుపులోకి తీసుకుంది. సుదీర్ఘ విచారణలో ఉగ్రదాడుల విషయాన్ని తీవ్రవాది బయటపెట్టినట్టు తెలుస్తోంది. 2018లో తెలంగాణ పోలీసులు బాసిత్ ను అరెస్ట్ చేశారు. ఉగ్రదాడి కుట్రను ఇరాన్ ఐసిస్ జంట బయటపెట్టింది. ఈ ఏడాది మార్చి లో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఐసిస్ జంట జహన్జెబ్ సమీ, హిండా బషీర్ బేగ్ ను ఓక్లా ప్రాంతంనుంచి అరెస్టు చేసారు. సీయేయే వ్యతిరేక ఉద్యమాలను కుడా ఈ జంట ప్రేరేపిస్తునట్లు పోలీసులు తెలిపారు. ఈ జంట ఇచ్చిన మేరకు బాసిత్ ను పోలీసులు ఇంటరాగేషన్ చేసారు. సీయేయే వ్యతిరేక ప్రదర్శనల్లో దాడులు జరపడానికి యువకులను సిద్దం చేయాలి. ఆలయాల్లో పంచే ప్రసాదాలో విషం కలపాలని బాసిత్ తనకు చెప్పాడని జహన్జేబ్ పోలీసు ఇంటరాగేషన్ లో వెల్లడించడంలో జాతీయ దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. తిహార్ జైలులో బాసిత్ దొంగచాటుగా ఉపయోగించిన సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.