బైక్ ఆపిన పోలీసులపై బూతుల వర్షం
హైదరాబాద్ ఏప్రిల్ 30,
నగరంలోని లంగర్ హౌజ్ లో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తున్న విషయం విదితమే. అయితే లాక్డౌన్ సమయంలో అకారణంగా బయటికి రావడంతో వాహనాదారుడిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆ వ్యక్తి పోలీసులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. తాను ఓ పోలీసు అధికారి కొడుకునంటూ పోలీసులపైనే తిరగబడ్డాడు. మీ అంతు చూస్తానంటూ పోలీసులపై బూతుల వర్షం కురిపించాడు. ఇవే కాదు.. ఇంకా రాయలేని భాషలో పోలీసులపై బూతులు మాట్లాడాడు. అంతేకాదు.. ఆయన బండిని కూడా రోడ్డుపై అలాగే పడేసుకున్నాడు. అక్కడున్న ఒకరిద్దరు పోలీసులు వాహనదారుడితో ఎంతో సహనంగా మాట్లాడినప్పటికీ ఇంకాస్త రెచ్చిపోయి ప్రవర్తించాడు. దీంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న స్టేషన్ కు తరలించారు.ఇంతకీ ఆ వ్యక్తి ఎవరని పోలీసులు ఆరా తీయగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. పేరు లోకేష్ . కొద్దిరోజుల క్రితమే మద్యం దొరక్క ఎర్రగడ్డలోని డీఅడిక్షన్ సెంటర్లో చికిత్స తీసుకున్న లోకేష్ ఇటీవలే డిశ్చార్జ్ అయ్యాడని తెలియవచ్చింది. ఏడాది క్రితం భార్య చనిపోవడంతో ఆయన పిచ్చి వాడిలా ప్రవర్తిస్తున్నాడని పోలీసులు మీడియాకు వెల్లడించారు. పోలీసుల దర్యాప్తులో అతనికి మతిస్థిమితం సరిగా లేదని తేలింది. ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు లంగర్ హౌస్ పోలీసులు అప్పగించారు. గత రెండు రోజులుగా చనిపోయిన తన భార్య గుర్తొచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు.

--