YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

రైతులకు ఆదుకోండి - టీటీడీపీ నేతలు

 రైతులకు ఆదుకోండి -	టీటీడీపీ నేతలు

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. పంట భీమా  కూడా వచ్చే పరిస్థితి కనబడటం లేదు.. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని టీటీడీపీ నేతలు ఆరోపించారు. శుక్రవారం నాడు రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ ను వారు కలిసారు. ఈ మేరకు ఒక వినతిపత్రం ఇచ్చారు.  అనంతరం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మీడియా తో మాట్లాడుతూ స్వామి నాథన్ కమిషన్ ప్రకారం  నష్టపోయిన రైతులను ప్రభుత్వం  వెంటనే ఆదుకోవాలి. భీమా కంపెనీలకు ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడం తో భీమా కంపెనీలు పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ముందుకు రావడం లేదు. అసెంబ్లీ లో ముఖ్యమంత్రి  హామీ ఇచ్చిన రైతులకు మేలు జరగడం లేదన్నారు. కల్తీ విత్తనాలను అరికట్టడంలో  ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని విమర్శించారు. మరో నేత  రావుల చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపుల పై ఉన్న శ్రద్ధ రైతు సంక్షేమం పైన లేదు. నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి కనీస చర్యలు తీసుకొలేదని అన్నారు. మూడు రోజుల్లో నష్ట నివారణ చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ కమిషనర్ చెప్పారు.. మూడు రోజుల్లో చర్యలు తీసుకోక పొతే తెలుగుదేశం పార్టీ రైతుల పక్షాన ఉద్యమం చేపడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని అన్నారు.  టీడీపీపీ యల్. రమణ  మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా కడగళ్ల వర్షం వల్ల  వేల ఎకరాల్లో పంట నష్టపోతే.. కేసీఆర్ విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నాడని అయన ఆరోపించారు. ప్రతి ఎకరాకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి.. నష్టపోయిన పంట వివరాలను ప్రభుత్వం వెంటనే  సేకరించాలని అన్నారు. ప్రభుత్వ పెద్దలు వెంటనే   క్షేత్ర స్థాయిలో పర్యటించాలి. ఆత్మ హత్యలు చేరుకున్న రైతు కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోక పోతే రైతు శవాలతో ప్రగతి భవన్ ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు.

Related Posts