YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

కల్లాల రాజకీయాలు తగదు: మంత్రి గంగుల

కల్లాల రాజకీయాలు తగదు: మంత్రి గంగుల

కల్లాల రాజకీయాలు తగదు: మంత్రి గంగుల
కరీంనగర్‌ ఏప్రిల్ 30
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్షాలు కార్లేసుకుని వచ్చి కల్లాల్లో రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మండిపడ్డారు. కొత్తపల్లి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గంగుల కమలాకర్‌ పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాళేశ్వరం జలాలు, 24 గంటల కరెంట్‌ వల్లే పంట దిగుబడి పెరిగిందన్నారు. 21 రోజుల్లో 21 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, సగటున రోజుకు లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. 3.5 లక్షల మంది రైతులు తమ పంటను ఇప్పటి వరకు అమ్ముకున్నారని చెప్పారు. భారీ ఎత్తున పంట దిగుబడి వచ్చి రైతులు సంతోషంగా ఉండటం కాంగ్రెస్‌, బీజేపీ నేతలకు ఇష్టం లేదన్నారు. పంట దిగుబడి చూసి ఓర్వలేకనే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదన్నారు.నారు, నీరు పోయని కాంగ్రెస్‌, బీజేపీ నేతల మాటలు నమ్మొద్దు.. నారు, నీరు పోసి ఆదుకుంటున్న కేసీఆర్‌ను మాత్రమే రైతులు నమ్మాలని మంత్రి సూచించారు. గుజరాత్‌, యూపీలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో.. రూ. 800లకే క్వింటాలు వడ్లు అమ్ముకుంటున్నారని తెలిపారు. దేశంలో చాలా రాష్ర్టాల్లో ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయడం లేదని మంత్రి గుర్తు చేశారు. కరోనా ప్రభావం రైతులపై పడకుండా ఉండేందుకు ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు.

Related Posts