నల్గొండ జిల్లా పడమటి తండా వద్ద జరిగిన ఘోర రోడ్ ప్రమాదం పట్ల మంత్రి జగదీష్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. సంఘటన విషయం తెలువడంతో హూటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి ఘటన పూర్వాపరాల ను అడిగి తెలుసుకున్నారు. తరువాత ప్రమాదం లో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. ఒక్క సారిగా తొమ్మిది మృత దేహాలను చూసి మంత్రి చలించి పోయారు. మృతుల బంధువులను పరామర్శించి మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ చర్యలు తీసుకుంటున్నారని తెలిసారు. మృతుల కుటుంబాలకు తక్షణ సహయంగా రెండు లక్షల నష్ట పరిహారం ప్రకటించడంతో పాటు అంత్యక్రియల నిమిత్తం ఒక్కో కుటుంబానికి 10 వేలు అందించాలంటూ అదేశాలు జారీ చేసారు. ఒక్కో బాధిత కుటుంబానికి రెండు పడకల ఇళ్లు, వారి పిల్లలకు విద్య పూర్తి అయ్యేదాకా ప్రబుత్వ ఖర్చులతో విధ్యా బోధన, ప్రభుత్వ పరంగా అందించే అన్నీ రకాల సహయం మృతుల కుటుంబాలకు అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. సంఘటన విషయం తెలిసిన ముఖ్యమంత్రి తీవ్ర అవేదనకు గురయ్యారని మంత్రి తెలిపారు.